ఆ విటమిన్ లోపం వల్లే కోవిడ్ కేసులు అధికం..బీ అలర్ట్

దేశం మొత్తం కరోనా కేసుల వల్ల అతలాకుతలమైంది. ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ తగ్గింది. అయితే మూడో వేవ్ వస్తే దానిని నివారించడం కష్టమైపోతుందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. కరోనా సెకండ్ వేవ్ కంటే ప్రమాదకరంగా థర్డ్ వేవ్ ఉంటుందని వారు అంచనా వేస్తున్నారు. అయితే దీనిపై మరింత స్పష్టత అనేది రావాల్సి ఉంది. ఇప్పుడు కరోనా నుంచి తప్పించుకునేందుకు ఒకే ఒక మార్గం ఉంది. అదే మన శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవడం. బలమైన రోగనిరోధక శక్తిని అభివృద్ధి చేసుకోవడం ప్రతి ఒక్కరూ చేయాల్సిన ముఖ్యమైన పని. కోవిడ్ మహమ్మారి టైంలో చాలా మంది సరైన ఆహారం తీసుకోకపోవడం వల్ల కరోనా బారిన పడి ప్రాణాలు వదిలారు. అందుకే సరైన పోషక విలువలున్న ఆహారాలు తీసుకోవడం ఎంతో అవసరం.

కరోనా మూడవ వేవ్ వస్తే ముప్పు ఏ మేరకు వస్తుందో తెలీదు. దానిని ఇంకా అంచనా వేయలేకపోతున్నారు. అయితే అది అత్యంత ప్రమాదకరమని మాత్రం చెబుతున్నారు. అందుకే విటమిన్ డి లోపం లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉంది. విటమిన్ డి అనేది సాధారణంగా ఆహారాలలో అది కనిపించదు. చాలా మందికి సూర్యకాంతి తగలకపోవడం వల్ల అనేక అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. అందుకే సాధ్యమైనంత వరకూ సూర్యకాంతిలో ఉండేలా చూసుకోవాలి. విటమిన్ డి లోపం ఉండేటటువంటి వ్యక్తుల్లో కరోనా మరింత ప్రమాదకరంగా ఉంటుంది. శరీరంలో రోగనిరోధక వ్యవస్థకు విటమిన్ డి అనేది ఎంతో ముఖ్యం. విటమిన్ డి అనేది తగినంత లేనప్పుడు శరీరం కరోనా వైరస్‌కు వ్యతిరేకంగా బలమైన రోగనిరోధక శక్తిని అభివృద్ధి చేయలేందు. విటమిన్ బి 12 లోపం కూడా తీవ్రంగా ఉంటుంది. అది రక్తహీనత, బలహీనత, నాడీ సంబంధిత సమస్యలు వాటిల్లేలా చేస్తుంది.

గుడ్లు, జున్ను, తృణధాన్యాలు, కొవ్వు చేపలు విటమిన్ డిని పెంచే పోషకాలని వైద్యులు సూచిస్తున్నారు. పాలు, జున్ను, చేపలు, మాంసం విటమిన్ బి12ను అధికంగా పెంచే ఆహారాలని చెప్పొచ్చు. చాలా మంది రోగులు అలసట, జ్ఞాపకశక్తి సమస్యలు, ఆందోళన, డిప్రెషన్, ఎముక మరియు కీళ్ల నొప్పులు వంటి లక్షణాలతో బాధపడుతున్నారు. శరీరంలో విటమిన్ డి మరియు విటమిన్ బి 12 స్థాయిలను పెంచడంతో పాటు, కోవిడ్ యొక్క మూడవ తరంగం నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి కొన్ని పాటించాల్సి ఉంటుంది. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

మొదటగా మీరు వ్యాధి నిరోధక టీకాలు వేయించుకోండి. ఆ తర్వాత కోవిడ్ ప్రోటోకాల్‌ను పాటించాలి. మధుమేహాన్ని నియంత్రించే జాగ్రత్తలు తీసుకోండి. మీ రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడం కోసం సరైన ఆహార నియమాలు పాటించాలి. ప్రస్తుతం దేశంలో కొన్ని కోవిడ్ కేసులు మాత్రమే నమోదవుతున్నాయి. కాబట్టి ఇలాంటి సమయంలో సరైన నియమాలు పాటిస్తే కరోనా నుంచి బయటపడొచ్చు. ఎటువంటి ఇబ్బంది లేకుండా విటమిన్ల లోపం లేకుండా చూసుకోవాలంటే సరైన ఆహార జాగ్రత్తలు, అలవాట్లను మార్చుకోవాల్సి ఉంటుంది. అప్పుడే ఏ అనారోగ్యం కూడా దరిచేరదు.

Leave a Comment