రోజూ అన్నం తినేవారికి ఆ డేంజర్..జరిగే దుష్ప్రభావాలు ఇవే

ప్రతి ఒక్కరూ తమ ఆకలిని తీర్చుకోవడం కోసం రోజూ చేసే పని ఒకటే. అదే అన్నం తినడం. రోజూ కొందరు మూడు సార్లు అన్నం తింటే ఇంకొందరు నాలుగైదు సార్లు అన్నం తింటూ ఉంటారు. అయితే ఇలా అన్నాన్ని ఎక్కువగా తినడం వల్ల అనే అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. భారతీయు వంటకాల్లో ముఖ్యంగా చేసుకునే ఈ అన్నం. అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు. అన్నం చేయడం చాలా సులభం. అందుకే చాలా మంది రొొట్టె కంటే ఎక్కువగా అన్నాన్ని చేసుకుని తింటుంటారు. అన్నం చేయడం వల్ల వారి సమయం కూడా ఆదా అవుతుంది. అయితే అన్నాన్ని ఎక్కువగా తినడం వల్ల అనేక అనారోగ్య సమస్యలనేవి వచ్చే అవకాశం ఉంది. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

అన్నాన్ని ఎక్కువగా తినడం వల్ల అనేక అనారోగ్య సమస్యలు వస్తాయి. అందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది డయాబెటిస్. సాధారణంగా ఒక కప్పు అన్నంలో కనీసం 10 టీస్పూన్ల కేలరీలు ఉంటాయనే విషయం తెలుసుకోవాలి. బియ్యాన్ని ప్రతి రోజూ తీసుకుంటే మధుమేహం వచ్చే అవకాశం ఉంది. అది చక్కెర స్థాయిని పెంచుతూనే ఉంటుంది. అందుకే మధుమేహ వ్యాధితో బాధపడేవారు అన్నాన్ని ఎక్కువగా తినకూడదని వైద్యులు సూచిస్తున్నారు.

అన్నం తినడం వల్ల త్వరగా కడుపు నిండిపోవడమే కాదు సులభంగా జీర్ణం అవుతుంది. అయితే అతిగా అన్నం తినడం వల్ల బరువు పెరిగే అవకాశం ఉంది. దానివల్ల ఊబకాయం వచ్చే ప్రమాదం ఉంటుంది. తెల్ల అన్నంలో ఫైబర్ అనేది చాలా తక్కువగానే ఉండటం వల్ల అన్నం ఎక్కువగా తింటే గ్యాస్-ఎసిడిటీ సమస్యలు వస్తాయి. అది జీర్ణక్రియను బలహీనంగా చేస్తుంది.

మీరు బాగా నిద్రపోవాలంటే అన్నాన్ని బాగా తినాలి. ముఖ్యంగా పగలు నిద్ర బాగా పట్టేస్తుంది. అన్నం తినడం వల్ల శరీరంలో చక్కెర స్థాయిలు వేగంగా పెరుగుతాయి. అందుకే దాని ఫలితంగా నిద్ర ఎక్కువగా పట్టేస్తుంది. అందుకే బియ్యాన్ని వాడకుండా ఉండాలి. ఆ అన్నం తినడం వల్ల బద్ధకం పెరుగుతుంది. దానివల్ల సోమరితనం కూడా వచ్చే ప్రమాదం ఉంది.

తెల్లటి బియ్యంలో విటమిన్ సి చాలా తక్కువగా ఉంటడం వల్ల శరీరానికి అవసరమైన చాలా పోషకాలు అందవు. దానివలన ఎముకలు బలహీనమైపోతాయి. ఎముకలకు పోషకాలు అందవు. అందుకే వీలైనంత వరకు అన్నం తినడం తగ్గించడం మంచిది.

అన్నం వండుకోవడం చాలా సులభం. అయితే ఆ అన్నం తినడం వల్ల అనేక సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. వీలైనంత వరకూ అన్నం తినడం తగ్గించాలి. అలా చేస్తే ఒంట్లో కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గి ఎటువంటి ఇబ్బంది రాదు. ముఖ్యంగా మధుమేహ వ్యాధి ఉన్నవారు అన్నాన్ని ఎక్కువగా తీసుకోకూడదు. అన్నం తింటే స్థూలకాయం వచ్చే ప్రమాదం కూడా ఉంది. అందుకే రోజులో ఓ పూట మాత్రమే అన్నం తినడాన్ని అలవాటు చేసుకుంటే ఎన్నో ఉపయోగాలు ఉంటాయి. అనేక అనారోగ్య సమస్యలు కూడా రావు.

Leave a Comment