ప్రత్యేక హోదాపై పోరాటం సాగిస్తాం : సీఎం జగన్

కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ ఇచ్చిన మాట ప్రకారం ప్రత్యేక హోదాను అమలు చేయాలని అడుగుతూనే ఉంటామని సీఎం జగన్ ప్రకటించారు. శనివారం 74వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జాతీయ జెండాను సీఎం జగన్ ఎగురవేశారు. అనంతరం సాయుధ దళాల గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం సీఎం జగన్ ప్రసంగించారు. స్వాతంత్య్ర సమయరయోధులకు పాదాభివందనం తెలిపారు. ఈ సందర్భంగా ప్రత్యేక హోదాపై మాట్లాడారు. 

కేంద్ర ప్రభుత్వం మిగతా పార్టీలపై ఆధారపడే పరిస్థితి లేదని, ఇప్పటికిప్పుడు హోదా ఇచ్చే అవకాశం కనిపంచకపోయినా..ప్రత్యేక హోదాను కచ్చితంగా సాధించాలనే ధ్రుడసకల్పంతో ఉన్నామని స్పష్టం చేశారు. ఇక అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేసేందుకు పాలనా వికేంద్రీకరణ చేశామని, సమన్యాయం జరిగేలా మూడు రాజధానుల బిల్లును చట్టంగా మార్చామని చెప్పారు. త్వరలో విశాఖ కేంద్రంగా కార్యనిర్వాహక రాజధాని, కర్నూలు కేంద్రంగా న్యాయ రాజఝధాని ఏర్పాటుకు పునాదులు వేస్తామని వెల్లడించారు. 

జలయజ్ఞం ద్వారా సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేస్తామన్నారు. 2022 ఖరీఫ్ నాటికి పోలవరం పూర్తి చేసే దిశగా అడుగులు వేస్తున్నామని వెల్లడించారు. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి, పల్నాడు కరువు నివారణ ప్రాజెక్టు, రాయలసీమ కరువు నివారణ ప్రాజెక్టు పనులు మొదలు పెట్టబోతున్నామన్నారు. ఈ ఏడాదిలో వంశధార ఫేజ్-2, వంశధార-నాగావళి అనుసంధానం, వెలిగొండ ఫేజ్-1, అవుకు టన్నెల్-2, సంగం బ్యారేజ్, నెల్లూరు బ్యారేజీలను పూర్తి చేసేందుకు వేగంగా అడుగులు వేస్తున్నామని సీఎం జగన్ తన ప్రసంగంలో పేర్కొన్నారు. 

 

Leave a Comment