కరోనా వ్యాక్సిన్ పై ప్రధాని మోడీ కీలక ప్రకటన..!

ఎర్రకోట వేదికగా 74వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కీలక ప్రకటన చేశారు. భారతదేశంలో కరోనా వైరస్ యొక్క మూడు వ్యాక్సిన్లు వివిధ దశల్లో ట్రయల్స్ లో ఉన్నాయని, వాటికి ఆమోదం లభించిన వెంటనే ప్రతి భారతీయుడికి వ్యాక్సిన్ ను చేరవేస్తామని వెల్లడించారు. దాని కోసం రోడ్ మ్యాప్ కూడా సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. 

ఆరోగ్య సంరక్షణ వ్యవస్థను పెంచడానికి పీఎం మోడీ జాతీయ డిజిటల్ హెల్త్ మిషన్ ను ప్రకటించారు. ప్రతి పౌరుడికి హెల్త్ ఐడీ కార్డ్ లభిస్తుందన్నారు. ఒక దేశం ఒక ఆరోగ్య కార్డు పథకంలో భాగంగా ఆధార్ కార్డు తరహాలో హెల్త్ కార్డు జారీ చేస్తామని పేర్కొన్నారు. దీంతో సంబంధిత వ్యక్తి చికిత్సలు, పరీక్షలు సహా వైద్య చరిత్ర అంతా డిజిటల్ రూపంలో ఈ కార్డులో భద్రపరుస్తామన్నారు. దీని వల్ల వ్యక్తి తన వెంట వైద్య పరీక్షల రిపోర్టులు, ప్రిస్క్రిప్షన్లు తీసుకెళ్లాల్సిన అవసరం ఉండదని స్పష్టం చేశారు. 

 

Leave a Comment