సాఫ్ట్ వేర్ ఇంజనీర్ అయితే మాకొద్దు.. పెళ్లి ప్రకటన వైరల్..!

దేశంలో సాఫ్ట్ వేర్ ఇంజనీర్లకు ఎంతో డిమాండ్ ఉంది. చాలా మంది తమ కూతుర్లకు సాఫ్ట్ వేర్ ఇంజనీర్ కి ఇచ్చి పెళ్లి చేయాలని కోరుకుంటారు. అందుకో లక్షల్లో కట్నం ఇచ్చేందుకు సిద్ధం అవుతారు. ఎందుకంటే సాఫ్ట్ వేర్ ఇంజనీర్లకు లక్షల్లో వేతనాలు ఉండటం, విదేశాల్లో ఉద్యోగం చేసే ఛాన్స్ ఉండటంతో వారికి అంత క్రేజ్ ఉంటుంది.. కానీ ఓ మ్యారేజ్ బ్యూరో ప్రకటనలో మాత్రం అందుకు భిన్నంగా ఉంది. ఆ ప్రకటన ఇప్పుడు వైరల్ గా మారింది.  

తమకు వరుడు కావాలంటూ ఓ అమ్మాయి వాళ్ల పేరెంట్స్ ఇచ్చిన ప్రకటన అందరిని ఆశ్చర్యపరుస్తోంది. సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ అయితే మాకొద్దూ అంటూ ఆ ప్రకటనలో ప్రత్యేకంగా ప్రస్తావించారు. సంపన్న బిజినెస్ ఫ్యామిలీకి చెందిన కుటుంబం మ్యారేజీ ప్రకటన ఇచ్చింది. ఎంబీఏ పూర్తి చేసిన వధువుకు వరుడు కావాలని పేర్కొంది.ఐఏఎస్, ఐపీఎస్ ,డాక్టర్, పారిశ్రామికవేత్త లేదా వ్యాపారవేత్త కావాలని కోరింది. అయితే సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్లు మాత్రం తమకు వద్దంటూ స్పష్గంగా తెలియజేశారు. ఈ ప్రకటన ప్రస్తుతం వైరల్ గా మారింది. 

దీనిపై నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. దేశంలో ఎక్కువ మంది సాఫ్ట్ వేర్ ఇంజనీర్లే ఉన్నారని.. ఈ లెక్కన దేశ భవిష్యత్ కూడా సజావుగా లేనట్టేనని ఓ నెటిజన్ కామెంట్ చేశారు. తాము అంత బ్యాడా అంటూ ఒక సాఫ్ట్ వేర్ ఇంజనీర్ తన ఆవేదన వ్యక్తం చేశాడు. ఓ మై గాడ్ … నాకు 11 ఏళ్ల క్రితమే పెళ్లి జరిగింది.. ఇప్పుడైతే పరిస్థితి ఏంటీ అంటూ మరొక సాఫ్ట్ వేర్ ఇంజనీర్ సెటైర్ వేశాడు.

Leave a Comment