10 ఏళ్లుగా కుడి చేతిని పైకి ఎత్తి ఉంచిన సాధువు..!

సాధారణంగా చేతిని పైకెత్తి ఎక్కువ సేపు ఉండలేము.. మహా అయితే 10-15 నిమిషాలు ఉండగలరు.. కానీ ఓ సాధవు మాత్రం దశాబ్దాలుగా ఎత్తిన చేతిని దించలేదు. గత 10 ఏళ్లుగా కుడి చేతిని పైకి ఎత్తే ఉంచాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే ఇలా చేతిని పైకెత్తి ఎన్ని రోజుల పాటు ఉంటారో ఇంకా నిర్ణయం తీసుకోలేదని ఆ సాధవు చెప్పారు. చేతిని పైకి ఉంచే నిద్రపోతారట.. ఆ సమయంలో ఆయనకు ఎలాంటి ఇబ్బంది కలగలేదట.. 

అయితే ఇలా చేతిని పైకి ఎత్తి ఉంచడం ఇది తొలిసారి కాదు. గతంలో అమర్ భర్తీ అనే 70 ఏళ్ల సాధువు సుమారు 50 సంవత్సరాల పాటు తన కుడి చేతిని పైకి ఎత్తి ఉంచినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. తొలి రెండేళ్లలో తీవ్ర నొప్పి ఉండేదని, కానీ అది క్రమంలో తగ్గిపోయిందని, ఆ తర్వాత ఎలాంటి నొప్పి లేదని సాధువు అమర్ భర్తీ తెలిపారు. ఆ చేతికి రక్త ప్రసరణ పూర్తిగా నిలిచిపోవడంతో నొప్పి కలగడం లేదని, ఇకపై ఆ చేతిని కిందకు దించలేదని వైద్యులు తెలిపారు. 

అమర్ భర్తీ 1973 వరకు ఓ సాధారణ వ్యక్తి.. అందరిలా పెళ్లి చేసుకుని పిల్లలతో జీవించేవారు. ఆ తర్వాత తన జీవితాన్ని శివుడికి అంకితం చేయాలని నిర్ణయించుకుని సాధువుగా మారారు. తనలోని శివుడి పట్ల ఉన్న నిబద్ధతను చాటుకునేందుకు కుడి చేతిని పైకి ఎత్తి ఉంచడం ప్రారంభించారు. ఆయన విషయం 2020లో వెలుగులోకి వచ్చింది. ఇప్పుడు మరో సాధువు కూడా పదేళ్ల నుంచి చేతిని పైకి ఎత్తి ఉంచారు. అయితే భర్తీ 50 ఏళ్ల రికార్డును బ్రేక్ చేయకపోయినా.. సాధ్యమైనంత వరకు చేతిని పైకి ఎత్తి ఉంచుతానని ఆయన చెబుతున్నారు. 

Leave a Comment