వర్క్ ఫ్రం హోమ్ కి గుడ్ బై.. ఆఫీసులకు రావాలని ఉద్యోగులకు టీసీఎస్..!

కరోనా కారణంగా రెండున్నరేళ్ల క్రితం ఐంటీ కంపెనీలు తమ ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోమ్ వెసులుబాటును కల్పించాయి. ఇప్పుడు ఆ సంస్కృతికి స్వస్తి చెబుతున్నాయి. తాజాగా దేశీయ దిగ్గజ ఐటీ కంపెనీ టీసీఎస్ తమ ఉద్యోగులు ఆఫీసులకు రావాలని స్పష్టం చేసింది. వారానికి మూడు రోజులు కచ్చితంగా ఆఫీసులకు రావాలని ఉద్యోగులకు ఈమెయిల్స్ పంపింది.. 

“వర్క్​ ఫ్రం ఆఫీస్​ కోసం మేనేజ్​మెంట్​ ఒక రోస్టర్​ను తయారు చేస్తుంది. అందురు దానికి తగ్గట్టుగా వారానికి మూడు రోజులు ఆఫీసుకు రావాల్సి ఉంటుంది. నిబంధనలు ఉల్లఘిస్తే.. చాలా తీవ్ర పరిణామాలు ఎదురవుతాయి,” అని ఉద్యోగులకు చేసిన మెయిల్​లో టీసీఎస్​ స్పష్టం చేసింది.

ఉద్యోగులను ఆఫీసులకు తీసుకొచ్చేందుకు సంస్థ చేపట్టిన ప్రణాళికల్లో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నాము అని టీసీఎస్​ యాజమాన్యం వెల్లడించింది. దీనికి 25X25 మోడల్​ అని పేరు పెట్టింది. అంటే.. ఆఫీసుల్లో కనీసం 25శాతం జనాభా ఉండాలి. 2025నాటికి దీనిని అమలు చేసే యోచనలో దిగ్గజ ఐటీ సంస్థ ఉంది. అయితే.. ఆఫీసులకు తిరిగొచ్చే విషయంలో ఉద్యోగులకు టీసీఎస్​ ఇంకా ఎలాంటి డెడ్​లైన్​ ఇవ్వలేదు. కానీ సంబంధిత మేనజర్లను సంప్రదించాలని ఉద్యోగులకు సూచించింది. ప్రాజెక్టు అవసరాలు, ఫ్రెషర్స్​- సీనియర్స్​ కలయికతో రోస్టర్​ను రూపొందించేందుకు టీసీఎస్​ ప్రణాళికలు రచించింది.

అయితే వర్క్​ ఫ్రం హోంకు అలవాటు పడిన ఉద్యోగులు ఆఫీసులకు వచ్చేందుకు మొగ్గుచూపడం లేదు. ఈ నేపథ్యంలో కొందరు ఉద్యోగాలను కూడా విడిచిపెట్టేస్తున్నారు కానీ ఆఫీసుకు వెళ్లడం లేదు. వర్క్​ ఫ్రం హోం ఇచ్చే వేరే సంస్థలో చేరేందుకు ఇష్టపడుతున్నారు. ఫలితంగా ఐటీ రంగంలో ఆట్రిషన్​ రేటు విపరీతంగా పెరిపోయింది. రాజీనామాలు ఎక్కువగా ఉంటుండటం ఆందోళనకు గురిచేస్తున్న విషయం. ఇది సంస్థల ఆర్థిక వ్యవస్థపై ప్రభావం పడే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

 

 

Leave a Comment