వలస కార్మికుల ఖర్చులు మేమే భరిస్తాం..

కేంద్రంపై మండ్డిపడ్డ సోనియా గాంధీ

వలస కార్మికులను తరలించేందుకు వారి వద్ద బీజేపీ ప్రభుత్వం ఛార్జీలు వసూలు చేయడాన్ని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ మండిపడ్డారు. మన ఆర్థిక వ్యవస్థకు వెన్నుముక అయిే వలస కూలీల రైల్వే ప్రయాణ ఖర్చులను తామే భరిస్తామని చెప్పారు.

లాక్ డౌన్ ప్రభావంతో లక్షలాది మంది కార్మికులు మరియు వలస కూలీలు దేశంలోని వివిధ ప్రాంతాల్లో చిక్కుకుపోయారన్నారు. వారు తమ ఇళ్లకు చేరేందుకు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. ఇలాంటి సమయంలో వారి వద్ద కేంద్ర ప్రభుత్వం వారి వద్ద టికెట్ల కోసం డబ్బులు వసూలు చేయడం హేయం అన్నారు. 

ట్రంప్ పర్యటనకు రూ.100 కోట్లు ఖర్చుపెట్టారు..విదేశాల్లో ఉన్న వారిని ప్రత్యేక విమానాల్లో దేశానికి తీసుకొచ్చిన ప్రభుత్వం ఇతర రాష్ట్రాల్లో చిక్కుకుపోయిన వలస కూలీలకు వారి సొంత ఊర్లకు పంపలేదా అని ప్రశ్నించారు. వలస కార్మికులు చిక్కుకుపోవడానికి కేంద్ర ప్రభుత్వమే కారణమని, కేవలం 4 గంటల సమయం ఇచ్చి లాక్ డౌన్ విధించారని మండిపడ్డారు. వలస కూలీల రైల్వే ప్రయాణానికి అయ్యే ఖర్చును కేంద్రమే భరించాలని కోరారు. 

 

Leave a Comment