విద్వేషాలు రెచ్చగొట్టాడని అర్నాబ్ గోస్వామిపై కేసు

ముస్లింలకు వ్యతిరేకంగా విద్వేషం రెచ్చగొట్టేందుకు ప్రయత్నించాడని రిపబ్లిక్ టీవీ ఎడిటర్ అర్నాబ్ గోస్వామిపై ముంబై పోలీసులు కేసు నమోదు చేశారు. నల్ బజార్ కు చెందిన రాజా ఎడ్యుకేషన్ వెల్ఫేర్ సొసైటీ సెక్రటరీ ఇర్ఫాన్ ఇచ్చిన ఫిర్యాదుపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసి విచారణ చేపట్టారు. వివరాల మేరకు ..అర్నాబ్ మరియు అతని ఛానల్ బాంద్రాలోని ఓ మసీద్ లక్ష్యంగా ముస్లింలపై ద్వేషం పెంచుతున్నారని ఇర్ఫాన్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు.

ఏప్రిల్ 14న వలస కూలీల నిరసనకు బాంద్రాలోని మసీదులకు ఎలాంటి సంబంధం లేదని తెలిపారు. మసీదు వద్ద ఉన్న ఖాళీ స్థలంలో వలస కూలీలు పెద్ద ఎత్తున చేరారని, కానీ అర్నాబ్ మాత్రం ఆ మసీదు మత ఘర్షణలకు యత్నస్తుందని తన సోలో చెప్పారని పేర్కొన్నారు. 

అయితే లాక్ డౌన్ సమయంలో బాంద్రాలోని మసీదు సమీపంలో జనం ఎందుకు గుమిగూడారని, వారిని గుమిగూడెలా చేసింది ఎవరని, ఇది ముస్లింలను టార్గెట్ చేసేందుకు చేసిన ప్లాన్ అని ఇర్ఫాన్ ఆరోపించారు. ఈ ఫిర్యాదుపై అర్నాబ్ పై కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నామని పోలీసులు చెప్పారు. ఆధారాల కోసం ఆ షోకు సంబంధించిన క్లిప్స్ సేకరిస్తున్నామని వెల్లడించారు. 

Leave a Comment