కనిపించని వ్యాధి.. ముందుగానే గుర్తించకపోతే అంతే.. లక్షణాలు ఇవే..!

ప్రపంచంలో ఎన్నో అత్యాధునిక వైద్య పద్ధతులు వచ్చాయి. అయినా ఆందోళన కలిగించే వ్యాధులు కొన్ని ఉన్నాయి. వాటిలో కిడ్నీ సమస్య ఒకటి.. కిడ్నీ సమస్య లక్షణాలు బయటికి కనిపించవు. మనంతటమనం కిడ్నీ ఎలా ఉందో తెలుసుకునేందు పరీక్షలు చేయించుకుంటేనే కిడ్నీ ఎలా ఉందో తెలుస్తుంది. అయితే కిడ్నీ పరీక్షలు ఎవరు చేయించుకోవాలన్న ప్రశ్న అందరికీ వస్తుంది. 

కిడ్నీ పరీక్షలు ఎవరు చేయించుకోవాలి?

  • కిడ్నీ పరీక్షలు ముఖ్యంగా డయాబెటీస్ ఉన్న వారు తప్పనిసరిగా ప్రతి ఆరు నెలలు లేదా సంవత్సరానికి ఒకసారి చేయించుకోవాలి. 
  • షుగర్ వ్యాధి ఏ వయస్సు వారికి వచ్చినా వ్యాధి వచ్చినప్పుడు మొట్టమొదటి సారిగా కిడ్నీ పరీక్షలు చేయించుకోవాలి. 
  • అనంతరం ప్రతి ఆరు నెలలకు కిడ్నీకి సంబంధించిన పరీక్షలను చేయించుకోవాలి. 

కడ్నీ చేసే పనులు ఏంటీ?

శరీరంలోని మలినాలను బయటకు పంపడంలో కిడ్నీలది కీలకపాత్ర. శుద్ధి చేయడం ద్వారా మూత్రపిండాలు ఒంట్లో పేరుకుపోయిన వ్యర్థాలను ఎప్పటికప్పుడు బయటకు పంపుతాయి. బీపీ, ఎలక్ట్రోలైట్ స్థాయిలను నియంత్రిస్తాయి. కానీ డయాబెటిస్, హై బీపీ లాంటి వ్యాధుల కారణంగా కిడ్నీల పనితీరు మందగిస్తుంది. కిడ్నీల పనితీరు మందగిస్తే శరీరం మొత్తానికి ప్రమాదం వాటిల్లుతుంది. కిడ్నీలు పూర్తిగా పాడైతే ప్రాణాలు దక్కకుండా పోతాయి. కాబట్టి ప్రాథమిక దశలోనూ కిడ్నీల సమస్యను గుర్తించి సరైన చికిత్స తీసుకోవాలి.

కిడ్నీ సమస్య లక్షణాలు ఇవే:

  • మూత్రం రంగు మారినా, మూత్రంలో అసాధారణ మార్పులు కనిపించినా కిడ్నీ సమస్య ఉందని భావించాలి. 
  • కిడ్నీలు తీవ్రంగా చెడిపోతే రుచి సామర్థ్యం, ఆకలి తగ్గుతుంది.
  • రక్తంలో వ్యర్థాల కారణంగా వికారం, వాంతులు లాంటి ఇబ్బందులు తలెత్తుతాయి. ఆకలి లేకపోవడంతో బరువు తగ్గుతారు. 
  • కిడ్నీలు సరిగా పనిచేయకపోతే శరీరంలో వ్యర్థాలు పేరుకుపోయి.. ముఖం, కాళ్లు ఉబ్బినట్లుగా కనిపిస్తాయి. 
  • కిడ్నీల పనితీరు మందగించడం వల్ల ఎర్ర రక్తకనాల ఉత్పత్తి తగ్గుతుంది. ఆక్సిజన్ స్థాయిలు తగ్గడం వల్ల శ్వాస సమస్యలు తలెత్తుతాయి. 
  • కిడ్నీలు పాడయినప్పుడు అవి ఉండే భాగంలో నొప్పి ఎక్కువగా ఉంటుంది. 
  • కిడ్నీలు చెడిపోయాయి అనడానికి ముందస్తు సూచన ఇది. ఏ విషయంపైనా ఎకాగ్రత ఉంచలేకపోవడం, తలనొప్పి, జ్ఞాపకశక్తి తగ్గడం వంటి సమస్యలు చుట్టుముడుతాయి. కాబట్టి ఏడాదికి ఒకసారి కిడ్నీల పనితీరును పరీక్షించుకోవడం ఉత్తమం..

 

Leave a Comment