‘బాలకృష్ణ నా ముఖంపై ఉమ్మేశాడు’.. కోట శ్రీనివాస రావు సంచలన వ్యాఖ్యలు..!

హీరో, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణపై నటుడు కోట శ్రీనివాసరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల సోషల్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన సినిమా కెరీర్ మొదట్లో ఆయన ఎదుర్కొన్న కొన్ని చేదు సంఘటనలను గుర్తు చేసుకున్నారు. తాను నటించిన మండలాధీశుడు సినిమాలో ఎన్టీఆర్ పాత్ర చేశానని, చాలా బాగా చేశావంటూ దివంగత నటుడు ఎన్టీఆర్ మెచ్చుకుంటే, ఆయన తనయుడు బాలకృష్ణ మాత్రం తన ముఖం మీద ఉమ్మేశాడని వ్యాఖ్యానించారు. 

గతంలో రాజమండ్రిలో ఓ సినిమా షూటింగ్ లో ఉన్నప్పుడు ఓరోజు బాలకృష్ణ కనిపించారు. గౌరవంగా నేనే నమస్కారం బాబు అని అన్నారు. కానీ ఆయన కాండ్రించి ముఖంపై ఉమ్మేశాడు. ఇది ఆయన సంస్కారం మరి. ఏం చేస్తాం? ఇలాంటి చేదు ఘటనలు మర్చిపోలేను అంటూ కోట శ్రీనివాసరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. కోట శ్రీనివాస రావు చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. 

Leave a Comment