పానీపూరీలో మూత్రం కలిపాడు.. వీడియో వైరల్..!

పానీపూరీ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరేమో.. పానీపూరీ చాలా మంది ఇష్టంగా తింటారు. రోడ్డు పక్కన పానీపూరీ బండి కనిపిస్తే చాలు దానిని టేస్ట్ చేయకుండా అస్సలు ఉండరు. కొంతమంది రోజూ పానీపూరీ తింటే కానీ వారికి తృప్తిగా ఉండదు. అయితే ఎక్కడపడితే అక్కడ పానీపూరీ తినడం వల్ల అనారోగ్యాలను ఇంటికి తెచ్చుకున్నట్లే.. కొంత మంది విక్రేతలు చేసే పనులు చూస్తే జీవితంలో దాని జోలికి కూడా వెళ్లరు. 

తాజాగా అసోంలో జరిగిన ఈ ఘటన పానీపూరీ ప్రియులకు షాక్ కు గురిచేస్తుంది. గుహవాటిలో ఓ వ్యక్తి పానీపూరీ నీటిలో మూత్రం కలిపి అమ్మేశాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో అతడిపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ వీడియో పోలీసుల వరకు చేరడంతో వారు దీన్ని సీరియస్ గా తీసుకున్నారు. ఆ వ్యక్తిని అరెస్టు చేశారు. 

Leave a Comment