తమిళ వ్యక్తిని పెళ్లి చేసుకోవాలని ఉంది : రష్మిక

ప్రస్తుతం టాలీవుడ్ టాప్ హీరోయిన్లలో రష్మిక ఒకరు.. అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ గా మారింది. ‘ఛలో’ సినిమా ద్వారా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన రష్మిక ‘గీతగోవిందం’ సినమాతో స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. 

ప్రస్తుతం రష్మిక అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ తెరకెక్కిస్తున్న పాన్ ఇండియా మూవీ ‘పుష్ప’లో నటిస్తోంది. ఇటీవల కోలీవుడ్ లోకి అడుగుపెట్టిన రష్మకి కార్తీ నటించిన ‘సుల్తాన్’ సినిమా ద్వారా తమిళ ప్రేక్షకులకు బాగా దగ్గరైంది. 

ఈనేపథ్యంలో తాజాగా ఆమె మాట్లాడుతూ ‘తమిళనాడు అంటే నాకు ఎంతో ఇష్టం. అక్కడ ప్రజలు, సంప్రదాయం నాకు ఎంతగానో ఆకర్షించింది. ముఖ్యంగా అక్కడి వంటకాలు అంటే అమితమైన ఇష్టం. అందుకే ఎప్పటికైనా తమిళ ఇంటి కోడలు కావాలన్నదే నా కోరిక’ అని తన మనసులోని మాటను రష్మిక బయటపెట్టింది.. 

 

Leave a Comment