గూగుల్ పే ద్వారా ఇంటర్నేషనల్ మనీ ట్రాన్స్ ఫర్..!

గ్లోబల్ దిగ్గజం గూగుల్ సరికొత్త సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. గూగుల్ పే ద్వారా ఇంటర్నేషనల్ మనీ ట్రాన్స్ ఫర్ సౌకర్యాన్ని ప్రవేశపెట్టింది. చెల్లింపుల సంస్థలు వైస్, వెస్ట్రన్ యూనియన్ కంపెనీతో భాగస్వామ్యంతో ఈ సేవలను ప్రవేశపెట్టింది. దీంతో ఇకపై అమెరికాలోని గూగుల్ పే వినియోగదారులు భారత్, సింగపూర్ లోని వినియోగదారులకు యాప్ ద్వారా నగదు ట్రాన్స్ ఫర్ చేయవచ్చు. 

ఈ ఏడాది చివరి నాటికి నగదు చెల్లింపుల సంస్థ వెస్ ద్వారా 80 దేశాలకు, వెస్ట్రన్ యూనియన్ ద్వారా 200 దేశాలకు ఈ సేవలను విస్తరించాలని గూగుల్ ప్రణాళికలు రచిస్తోంది. 470 బిలియన్ డాలర్ల చెల్లింపుల మార్కెట్ బరిలో ఉన్న గూగుల్ టెక్నాలజీ తన ఫైనాన్షియల్ సేవలను మరింత విస్తరించాలని యోచిస్తోంది. 

డిజిటల్ పేమెంట్స్ రంగంలో పోటీ గా ఎదగాలని యోచిస్తోంది. తక్కువ ఫీజులు, సులభంగా ఇంటర్నేషనల్ మనీ ట్రాన్స్ ఫర్ లక్ష్యంతో లండన్ కేంద్రంగా 2011లో పనిచేస్తున్న చెల్లింపుల సంస్థ వైస్ ప్రారంభమైంది. అయితే అంతర్జాతీయ మనీ ట్రాన్స్ ఫర్ విషయంలో వెస్ట్రన్ యూనియన్ చెల్లింపుల మార్కెట్ లీడర్ గా కొనసాగుతోంది. అంతర్జాతీయంగా భౌతిక కార్యాలయాలు కూడా ఉన్నాయి. 

ఇక గూగుల్ పేకి 40 దేశాల్లో 150 మిలియన్ల మంది వినియోగదారులు ఉన్నారు. కోవిడ్-19 కారణంగా ఆన్ లైన్ చెల్లింపులు అమాంతం పెరగడం, ఆన్ లైన్ చెల్లింపులు కంపెనీలకు వరంగా మారింది. అయితే 2019 నుంచి ఆర్థిక వ్యవస్థలు క్షీణించిన నేపథ్యంలో స్వదేశానికి డబ్బులు పంపించే వలస కార్మికుల సంఖ్య గణనీయంగా తగ్గింది. 

Leave a Comment