అమిత్ షా మిస్సింగ్.. అంటూ ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు..!

ప్రస్తుతం ‘అమిత్ షా మిస్సింగ్’ అనే హ్యాష్ ట్యాగ్ ట్విట్టర్ లో ట్రెండ్ అవుతోంది. కరోనా మహమ్మారి వేళ్ల ఆయన ఆచూకీ లేకుండా పోయిందని ట్వీట్ల మీద ట్వీట్లు చేస్తున్నారు. నిజానికి ఆయన తప్పిపోలేదు. కానీ, నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా(ఎన్ఎస్ యూఐ), ట్విట్టర్ ప్రకారం ఆయన జాడ తెలియడం లేదు..

దేశం కోవిడ్ పై పోరాటం చేస్తుంటే హోం మంత్రి మిస్సింగ్ ఇన్ యాక్షన్(హెచ్ఎం ఎంఐఏ) అని సూచిస్తూ చాలా మంది ట్విట్లు చేస్తున్నారు. కాగా, ఎన్ఎస్ యూఐ కార్యదర్శి నగేష్ కరియప్ప ఫిర్యాదు మేరకు ఢిల్లీ పోలీసులు బుధవారం ఎన్ఎస్ యూఐ కార్యాలయానికి వెళ్లారు. కరోనా మహమ్మారి గుప్పిట్లో దేశం చిక్కుకుందని, ప్రజలు సంక్షోభంలో ఉన్నారని, ఇలాంటి తరునంలో అమిత్ షా కనిపించకుండా పోయారని నగేష్ కరియప్ప పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. 

రాజకీయ నాయకులు దేశానికి సేవ చేయాలే కానీ, సంక్షోభ పరిస్థితుల్లో పలాయనవాదం చిత్తగించకూడదని కరియప్ప తన ఫిర్యాదులో పేర్కొన్నారు. రాజకీయ నాయకులు జవాబుదారీతనంతో ఉండాలని, జవాబుదారీతనం కేవలం భారత ప్రభుత్వానికి, బీజేపీకి మాత్రమే కాదని, దేశ ప్రజల పట్ల తప్పనిసరిగా ఉండి తీరాలని అన్నారు. చివరిసారిగా అమిత్ షా బెంగాల్ ప్రచారంలో కనిపించారని కూడా ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు. 

 

Leave a Comment