సీఎం కేసీఆర్ సంచలన నిర్ణయం..తెలంగాణలో వీఆర్వో వ్యవస్థ రద్దు..!

తెలంగాణలో సీఎం కేసీఆర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. వీఆర్వో వ్యవస్థను రద్దు చేయాలని నిర్ణయించుకున్నారు. ఇప్పటికే వారి నుంచి రికార్డులను స్వాధీనం చేసుకున్నారు. అవినీతి నిర్మూలనే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. గ్రామస్థాయిలో వీఆర్వోలు అవినీతికి కేంద్ర బిందువుగా మారారు. రైతులు పాస్ బుక్ కోసం ఏళ్ల తరబడి వారి చుట్టూ తిరుగుతున్నా పనులు జరగడం లేదు. ఇలాంటి అవినీతి వ్యవస్థను రద్దు చేయడం పట్ల రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.  

సోమవారం నుంచి ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాల్లో తెలంగాణ సీఎం కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నారు. కొత్త రెవెన్యూ చట్టం రూపకల్పనకు అనుగుణంగా వీఆర్వోల వ్యవస్థ రద్దు చేశారు. అయితే వీఆర్వోలను ఉద్యోగాల నుంచి తొలగించకుండా వేరే శాఖలో సర్దుబాటు చేసే విధంగా సీఎం కేసీఆర్ ఇదివరకే అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. 

Leave a Comment