తన జిమ్ ట్రైనర్ కు ఖరీదైన కారు గిఫ్ట్ ఇచ్చిన ప్రభాస్..

టాలీవుడ్ హీరోె ప్రభాస్ బాహుబలి చిత్రంతో ప్రపంచ వ్యాప్తంగా భారీ అభిమానులను సంపాదించుకున్నారు. ఇప్పటి వరకు అత్యధిక వసూళ్లు సాధించిన రెండో భారతీ చిత్రంగా బాహుబలి నిలిచింది. ప్రభాస్ సినిమాల్లోనే కాకుండా రియల్ లైఫ్ లోనూ పెద్ద మనసు చాటుకున్నాడు. తన ఫిట్ నెస్ ట్రైనర్ లక్ష్మణ్ రెడ్డికి ఖరీదైన కారును బహుకరించి అతని కుటుంబాన్ని ఆనందంలో ముంచెత్తాడు. 

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఫిట్ నెస్ ట్రైనర్ గా లక్ష్మణ్ చాలా కాలంగా పనిచేస్తున్నాడు. ప్రభాస్ ను లక్ష్మణ్ సరికొత్తగా మేకోవర్ చేశాడు. ప్రభాస్ ఫిట్ నెస్ పరంగా పర్సనల్ కేరింగ్ తీసుకున్నాడు. దీంతో లక్ష్మణ్ సేవలకు గుర్తుగా రూ.73.30 లక్షలు విలువ చేసే ఇండియా రేంజ్ రోవర్ వెలార్ ఎస్ యూవీని గిఫ్ట్ గా ఇచ్చాడు ప్రభాస్..ఈ సర్ ప్రైజ్ గిఫ్ట్ ఇవ్వడంతో లక్ష్మణ్, అతని ఫ్యామిలీ ఆనందం వ్యక్తం చేశారు.  

Leave a Comment