వొడాఫోన్ రీచార్జ్ చేస్తే క్యాష్ బ్యాక్..

ఇప్పుడు వొడాఫోన్ కూడా ఎయిర్టెల్, జియో అడుగుజాడల్లో నడుస్తోంది. వొడాఫోన్ ఐడియా కూడా ఇప్పుడు కొత్తగా Racharge For Good పేరిట ఒక ప్రోగ్రామ్ ను ప్రవేశపెట్టింది. దీని ద్వారా ఇతర ప్రీపెయిడ్ కస్టమర్లకు రీచార్జ్ చేస్తే కమీషన్ పొందే వీలు కల్పించింది. వొడాఫోన్ ఐడియా ఇప్పడికే ఉన్న తమ వొడాఫోన్ లేదా ఐడియా కస్టమర్లు వేరేవారికి చేసిన రీచార్జిపై 6 శాతం క్యాష్ బ్యాక్ ను అందిస్తోంది. 

ఈ రీచార్జీలను MyVodafone లేదా MyIdea యాప్ లను ఉపయోగించి నిర్వహించాలి. వొడాఫొన్ క్యాష్ బ్యాక్ 6 శాతం క్యాష్ బ్యాక్ అందిస్తుంది. ఇది ఎయిర్టెల్ మరియు జియో అందించే 4.16 శాతం కంటే ఎక్కువ. 

కరోనా లాక్ డౌన్ కారణంగా దుకాణాలన్నీ మూసివేయబడ్డాయి. అందు కోసం వొడాఫోన్ ఐడియా ఈ కొత్త ఆఫర్ ను విడుదల చేసింది. తమ కస్టమర్లు ఈ వొడాఫోన్ ఐడియా క్యాష్ బ్యాక్ మరియు ఇతర ఆపరేటర్ల నుంచి ఇలాంటి కమిషన్ ఆఫర్ ఈ లాక్ డౌన్ సమయంలో చాలా ఉపయోగపడుతుంది. 

వొడాఫోన్ MyVodafone యాప్ లోని బ్యానర్ ను ఉపయోగించి Racharge For Good ప్రోగ్రామ్ ను ప్రోత్సహిస్తోంది. ఈ క్యాష్ బ్యాక్ సంపాదించడానికి టెలికం ఆపరేటర్ సపరేట్ గా రిజిస్టర్ చేసుకోవాల్సిన అవసరం లేదు. మరియు ఇతర యాప్ లన ఇన్ స్టాల్ చేసుకోవాల్సిన పని లేదు. ఇందులో రీచార్జ్ చేసిన 96 గంటల్లో వినియోగదారుల ఖాతాకు క్యాస్ బ్యాక్ జమ అవుతుంది. 

వొడాఫోన్ లో రూ.149 రీచార్జ్ చేస్తే రూ.10, రూ.249 రీచార్జ్ చేస్తే రూ.15 క్యాష్ బ్యాక్ పొందవచ్చు. రీచార్జ్ ను బట్టి 6 శాతం క్యాష్ బ్యాక్ పొందవచ్చు. 

అయితే వినియోగదారులు MyVodafone లేదా MyIdea యాప్ లను ఉపయోగించి మాత్రమే రీచార్జ్ చేయాల్సి ఉంటుంది. మరెక్కడైన రీచార్జ్ చేయడం వల్ల వారికి క్యాష్ బ్యాక్ లభించదు. ఈ ఆఫర్ ఏప్రిల్ 30 వరకు మాత్రమే ఉందని వొడాఫోన్ పేర్కొంది. 

 

Leave a Comment