జియో రీచార్జ్ చేయండి..కమీషన్ పొందండి..

 

రిలయన్స్ జియో మరొక కొత్త యాప్ ను తీసుకొచ్చింది. జియో యూజర్లకు రీచార్జ్ చేయడానికి JioPOS పేరుతో కొత్త యాప్ ను విడుదల చేసింది. ఈ యాప్ ద్వారా జియో కస్టమర్లకు రీచార్జ్ చేయవచ్చు. ఈ యాప్ ను డైరెక్టుగా గూగుల్ ప్లేస్టోర్ నుంచి డౌన్ లోడ్ చేసుకోవచ్చు. 

ఈ యాప్ ద్వారా జియో ప్రీపెయిడ్ రీచార్జీలను చేయవచ్చ మరియు కమీషన్ కూడా పొందవచ్చు. ఈ యాప్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవడం చాలా సులభం మరియు ఎలాంటి పత్రాలు సమర్పించాల్సిన పని లేదు. దీనికి భౌతిక ధ్రువీకరణ కూడా అవసరం లేదు.

ఈ JioPOS లైట్ యాప్ ద్వారాా జియో భాగస్వామి అయిన తరువాత ఏ యూజర్ అయినా ఇతర జియో కస్టమర్ల ఖాతాలను రీచార్జ్ చేసుకొని కమీషన్ సంపాదించుకోవచ్చు. ఇప్పటికే MyJio యాప్ లేదా జియో వెబ్ సైట్ ను ఉపయోగించి ఇతర జియో కస్టమర్లకు రీచార్జ్ చేయగలిగినప్పటికీ, ఆ రీచార్జ్ లపై జియో మీకు కమీషన్ ఇవ్వదు. 

JioPOS లైట్ యాప్ ఇతర జియో నెంబర్లకు రీచార్జ్ చేయడం ద్వారా 4.16 శాతం కమీషన్ అందిస్తుంది. ఇందులో పాస్ బుక్ ఫీచర్ ఉంటుంది. ఇందులో మనకు వచ్చిన కమీషన్ ను చెక్ చేసుకోవచ్చు. 

రిజిస్ట్రేషన్ ఎలా?

JioPOS యాప్ ను ఇన్ స్టాల్ చేసి అవసరమైన అనుమతులు ఇచ్చన తరువాత, JioPOS లైట్ మిమ్మల్ని రిజిస్ట్రేషన్ చేయమని మరియు Jio భాగస్వామి కావాలని అడుగుతుంది. మీరు Jio భాగస్వామి కావడానికి అర్హత పొందడానికి మీ దగ్గర Jio నెంబర్ ఉండాలి. రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి అయిన తర్వాత మీ వాలెట్ లోకి డబ్బును లోడ్ చేయమని యాప్ అడుగుతుంది.  మీరు రీచార్జ్ చేసినప్పుడు 4.16 శాతం కమీషన్ పొందవచ్చు. 

JioPOS లైట్ యాప్ గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఆండ్రాయిడ్ ఫోన్లలో ఉచితంగా డౌన్ లోడ్ చేసుకోవచ్చు. అయితే ప్రస్తుతం ఐఓఎస్ వెర్షన్ కు ఈ సదుపాయం లేదు. 

Leave a Comment