స్లీల్ ప్లాంట్ లో మేనేజ్ మెంట్ ట్రైనీస్

దేశంలోని తీర ప్రాంతంలో ఉన్న అతి పెద్ద స్టీల్ ప్లాంట్.. విశాఖ పట్నం స్టీల్ ప్లాంట్ (రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ (ఆర్ఐఎన్ఎల్)..మేనేజ్ మెంట్ ట్రైనీ పోస్టుల భర్తీకి దరఖాస్తులను కోరుతుంది. ఆర్ఐఎన్ఎల్ నోటిఫికేషన్ విడుదల చేసింది.

పోస్టులు, విభాగాలు

మొత్తం పోస్టుల సంఖ్య : 188.

ఇందులో సిరామిక్స్ -04, కెమికల్-26, సివిల్-5, ఎలక్ట్రికల్-45, ఇన్ స్ట్రుమెంటేషన్ అండ్ ఎలక్ట్రానిక్స్-10 మెకానికల్-77, మెటలర్జీ-19, మైనింగ్-02 విభాగాలకు సంబంధించిన పోస్టులు ఉన్నాయి. 

అర్హతలు :

  • సంబంధిత విభాగాల్లో కనీసం 60 శాతం మార్కలతో ఇంజనీరింగ్ పూర్తి చేసి ఉండాలి. ఏప్రిల్ లేదా మేలో నిర్వహించే ఇంటర్వ్యూ  సమయానికి నిర్దేశిత మార్కులతో కూడిన ప్రొవిజనల్ పాస్ సర్టిఫికెట్ లను కలిగి ఉండాలి. 
  • వయోపరిమితి : 27 ఏళ్లకు మించకూడదు. నిబంధనలను అనుసరించి ఎస్సీ, ఎస్టీలకు 5 ఏళ్లు, ఓబీసీ నాన్ క్రిమిలేయర్ అభ్యర్థులకు మూడేళ్లు, దివ్యాంగులకు 10 ఏళ్లు గరిష్ట వయోపరిమితి సడలింపు ఉంటుంది. 

ఎంపిక ప్రక్రియ

  • ఆన్ లైన్ టెస్ట్, ఇంటర్వ్యూల ఆధారంగా అభ్యర్థలను ఎంపిక చేస్తారు. 

ఆన్ లైన్ టెస్ట్ : కంప్యూటర్ ఆధారితంగా ( సీబీటీ – కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ) నిర్వహించే ఆన్ లైన్ పరీక్ష మొత్తం 100 ప్రశ్నలు- 100 మార్కులకు జరుగుతుంది. ప్రతి సరైన సమాధానానికి  ఒక మార్కు ఉంటుంది. ఈ పరీక్షల్లో ఎటువంటి నెగిటివ్ మార్కల విధానం లేదు. జనరల్ అవేర్ నెస్, న్యూమరికల్ ఎబిలిటీ/అప్టిట్యూడ్, జనరల్ ఇంగ్లిష్, డేటా ఇంటర్ ప్రిటేషన్, వెర్బల్ అండ్ నాన్ వెర్బల్ రీజనింగ్ సబ్జెక్టుల నుంచి ప్రశ్నలు వస్తాయి. 

పరీక్ష కేంద్రాలు : హైదరాబాద్, కాకినాడ, రాజమండ్రి, విజయవాడ, విశాఖపట్నం.

పర్సనల్ ఇంటర్వ్యూ : ఆన్ లైన్ టెస్ట్ లో అర్హత సాధించిన అభ్యర్థులను పర్సనల్ ఇంటర్వ్యూలకు పిలుస్తారు. ఇంటర్వ్యూలోనూ ప్రతిభ చూపిన వారిని తుది ఎంపిక చేస్తారు. 

శిక్షణ : మేనేజ్ మెంట్ ట్రెయినీ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు ఏడాదిపాటు ప్రాథమిక శిక్షణ ఇస్తారు. విజయవంతంగా శిక్షణ పూర్తి చేసుకున్న అభ్యర్థులకు మరో ఏడాది పాటు ప్రొబేషన్ గా నియమిస్తారు. అనంతరం పూర్తి స్థాయి ఉద్యోగ బాధ్యతలను అప్పగిస్తారు. 

వేతనం : మేనేజ్ మెంట్ ట్రైనీలుగా ఎంపికైన అభ్యర్థులకు రూ.20,600-46,500 పేస్కేలు ఉంటుంది. అలాగే పూర్తి స్థాయి ట్రైనింగ్ పూర్తి చేసుకున్న అభ్యర్థులకు రూ.24,900-50,500 పేస్కేలు ఉంటుంది. వేతనంతో పాటు ఇతర అలవెన్సులు అందుతాయి. 

దరఖాస్తు ఫీజు : జనరల్, ఓబీసీ అభ్యర్థులకు రూ.590 ( జీఎస్టీ 18 శాతం కలుపుకొని), ఎస్సీ, ఎస్టీ, దివ్వాంగ అభ్యర్థులందరు రూ.295 దరఖాస్తు ఫీజుగా చెల్లించాలి. 

ముఖ్యమైన సమాచారం : 

ఆన్ లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభ తేదీ : 24.01.2020

ఆన్ లైన్ రిజిస్ట్రేషన్ ముగింపు తేదీ : 13.02.2020

ఫీజు చెల్లింపు ఆఖరు తేదీ : 14.02.2020

వెబ్ సైట్ : www.vizagsteel.com

Leave a Comment