కియా తరలిపోతోంది..!

అంతర్జాతీయ పత్రిక రాయిటర్స్ లో కథనం

అమరావతి : కియా ప్లాంట్ రాష్ట్రం నుంచి తమిళనాడుకు తరలిపోతున్నట్లు అంతర్జాతీయా మీడియా రాయిటర్స్ కథనం ప్రచురించింది. తమిళనాడు ప్రభుత్వంతో కియా ప్రతినిధులు చర్చలు జరుపుతున్నాయంటోంది. రాష్ట్రంలో ప్రభుత్వం మారడంతో పారిశ్రామిక రాయితీలపై ప్రభుత్వం పునరాలోచన చేయడమే తరలింపునకు కారణమంటూ కథనంలో పేర్కొంది. ఏపీలో ఆ సంస్థకు ఇబ్బందులు ఎదురవుతుండటంతో ప్లాంట్ తరలించాలని భావిస్తున్నారని తమిళనాడుకు చెందిన కీలక అధికారి కూడా దీన్ని ధృవీకరించినట్లు ఆ పత్రిక కథనాన్ని ప్రచురించింది. కియా తన అనుబంధ సంస్థ అయిన హుందాయ్ ప్రతినిధులతో చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. కియా పరిశ్రమ ఏర్పాటుతో పెనుగొండ పరిసరాల్లో భముల ధరలకు రెక్కలొచ్చాయి. కియాను తరలిస్తే ఏపీలో పరిశ్రమల ఏర్పాటుకు ఎవరూ ముందుకు రారని జాతీయ పత్రికలు పేర్కొంటున్నాయి. కియాకు ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన కొన్ని నిబంధనలు అడ్డంకిగా మారాయని, అందులో స్థానికులకు 75 శాతం ఉద్యోగాల నిబంధన ప్రధానంగా ఇబ్బందిగా మారిందని రాయిటర్స్ చెబుతోంది. తమిళనాడుకు ప్లాంట్ ను తరలిస్తే లాజిస్టిక్ ఖర్చలు కూడా తగ్గుతాయని కియా భావిస్తోందట. ప్లాంట్ తరలింపుపై ఇప్పటికిప్పుడే క్లారిటీ రాకపోయినా… కియా రాష్ట్రం నుంచి త్వరగా తరలిపోతుందని అర్థమవుతుందంటోంది రాయిటర్స్ పత్రిక..

రాయిటర్స్ కథనం అవాస్తవం..

అయితే తరలింపు ప్రయత్నాలు జరగట్లేదని కియా యాజమాన్యం చెబుతోంది. కియా మోటర్స్ పై రాయిటర్స్ కథనం పూర్తిగా అవాస్తవమని పరిశ్రమలు, వాణిజ్యం, పెట్టుబడుల శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రజత్ భార్గవ వెల్లడించారు. కియా, ఏపీ ప్రభుత్వం కలిసి పనిచేస్తున్నాయన్నారు.

Leave a Comment