రైస్ కార్డు స్టేటస్ తెలుసుకునే విధానం

వైఎస్సార్ నవశకం ద్వారా కొత్త రైస్ కార్డులు అందించేందుకు ప్రభుత్వం సర్వే చేయడం జరిగింది. ఫిబ్రవరి 15 నుంచి రాష్ట్రంలో కొత్త రైస్ కార్డులు అందజేస్తారు. ఆ కొత్త రైస్ కార్డు రావాలంటే మాపింగ్ లిస్ట్ లో మన పేరు, రేషన్ కార్డు నంబరు ఉండాలి. అవి ఉంటేనే మనకు రైస్ కార్డు అనేది జారీ చేయడం జరుగుతుంది.

ఎన్ని కార్డులు మ్యాపింగ్ అయ్యాయి? ఎన్ని కాలేదు? అసలు మన పేరు మ్యాపింగ్ లిస్ట్ లో ఉందా లేదా మన వలంటీర్ మ్యాపింగ్ చేశారా లేదా ? అని ఏ విధంగా తెలుసుకోవాలో మనం తెలుసుకుందాం…ఒక వేళ దీనిలో పేరు లేకపోతే మీ సచివాలయంలో లేదా మీ వలంటీర్ వద్ద కొత్త రేషన్ కార్డుకు అప్లయి చేసుకోవాల్సి ఉంటుంది..వారు పరిశీలించి కొత్త రేషన్ కార్డుకు అప్లయి చేస్తారు. మన రైస్ కార్డు మ్యాప్ అయిందా? లేదా ? తెలుసుకోవడం కోసం కింద చెప్పబోయే ప్రోసెస్ ని ఫాలో అవండి..

ముందుగా మనం గ్రామా, వార్డు సచివాలయం వెబ్ సైట్ www.gramawardsachivalayam.ap.gov.in లోకి లాగిన్ కావాల్సి ఉంటుంది. ఈ వెబ్ సైట్ ఓపెన్ చేయగానే మనకు 13 జిల్లాల్లో ఎన్ని సచివాలయాలు ఉన్నాయి? ఎన్ని రైస్ కార్డులు ఉన్నాయి? ఎన్ని మ్యాపింగ్ అయ్యాయి ? ఎన్ని పెండింగ్ లో ఉన్నాయి అనేది చూపించడం జరుగుతుంది. తర్వతా మనం పేజిని కిందికి స్క్రోల్ చేస్తే 13 జిల్లాల లిస్ట్ ఉంటుంది. 

rice card

  • మొదటగా మనం మన జిల్లాను సెలెక్ట్ చేసుకోవాలి. 

 

  • అనంతరం మనకు ఇంకో పేజీ ఓపెన్ అవుతుంది. ఆ పేజీలో మనం ఎంచుకున్న జిల్లాలో ఎన్ని సచివాలయాలు, రైస్ కార్డులు, ఎన్ని మ్యాపింగ్ చేయబడ్డాయి? ఎన్ని కాలేదు అని పూర్తి సమాచారం ఉంటుంది. 

  • ఆ తర్వాత మనం మన మండలాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. అప్పుడు మనకు ఇంకో పేజీ ఓపెన్ అవుతుంది. ఇందులో మన మండలానికి సంబంధించి ఎన్ని సచివాలయాలు, ఎన్ని రైస్ కార్డులు, మ్యాపింగ్ అయినవి ఎన్ని, పెండింగ్ ఉన్నవి..ఇలా పూర్త సమాచారం అయితే ఇందులో ఉంటుంది. ఇక్కడ మనకు మన మండలంలో కాలనీ లేదా గ్రామానికి సంబంధించిన సమాచారం ఉంటుంది. ఇక్కడ మన సచివాలయాన్ని సెలెక్ట్ చేసుకుని అదే వరుసలో మనకు mapped, Total rice cards అని బ్లూ కలర్ లో రెండు ఆప్షన్స్ కనిపిస్తాయి. 

  • వాటిపై క్లిక్ చేసిన తరువాత మన సచివాలయానికి సంబంధించి ఎన్ని రైస్ కార్డులు ఉన్నాయో అక్కడ డిస్ ప్లే అవుతుంది. అందులో మన రైస్ కార్డు ఐడీ, పేరు ద్వరా మన రైస్ కార్డు మ్యాపింగ్ అయిందో లేదో తెలుసుకోవచ్చు. 

ఈ విధం గా మనం AP లో కొత్త రైస్ కార్డ్ డీటెయిల్స్ ని తెలుసుకోవచ్చు .

CLICK HERE TO CHECK RICE CARD STATUS :- https://www.spandana.ap.gov.in/Navasakam/RationCardStatus.aspx

Leave a Comment