వీసా లేకుండానే.. ఈ దేశాలకు వెళ్లి రావచ్చు.. 

Visa Free Countries for Indians : వీసా లేకుంటే ఇతర దేశాల్లో ఎంట్రీ ఉండదని అందరికీ తెలిసిందే.. కానీ వీసా లేకుండానే కొన్ని దేశాాలకు వెళ్లి రావచ్చు. అందుకు కావాల్సింది కేవలం ఇండియన్ పాస్ పోర్ట్ మాత్రమే.. ఎందుకంటే ఇండియన్స్ కి కొన్ని దేశాలు వీసా ఫ్రీ ఎంట్రీ ఇస్తున్నాయి. ఆ దేశాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.. 

ఇప్పటికే వీసా లేకుండా మాల్దీవ్స్ దేశంలోకి ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే.. మాల్దీవ్స్ కాకుండా వీసా ఫ్రీ ఎంట్రీ ఇస్తున్న దేశాలు ఇంకా చాలానే ఉన్నాయి. మలేషియా, కెన్యా, ఇండోనేషియా, సీచెల్లెస్, డొమినికన్, ఆల్బేనియా, సెర్బియా, బోత్స్వానా, ఇథియోపియా, ఉగాండా దేశాలు వీసా ఫ్రీ ఎంట్రీ కల్పిస్తున్నాయి. 

మలేషియా

మలేషియా అద్భుతమైన వెకేషన్ స్పాట్. ఆ దేశానికి వీసా లేకుండా 30 రోజులు ఆనందంగా గడపవచ్చు. ఢిల్లీ నుంచి మలేషియా రాజధాని కౌలాలంపూర్‌కు విమాన టికెట్ ధర కూడా అంత ఎక్కువ కాదు. మలేషియా దేశం ప్రసిద్ధి చెందిన వంటలు, పెద్ద పెద్ద భవంతులు, షాపింగ్ మాల్స్, మార్కెట్లకు ప్రసిద్ధి. కిక్కిరిసిన మెర్డెకా స్క్వేర్ వీధులు, నేషనల్ మాస్క్, చైనా టౌన్, లిటిల్ ఇండియా అద్భుత అనుభూతిని కల్గిస్తాయి.

డొమినికన్

తూర్పు కరేబియన్ సముద్రంలోని ద్వీపం ఇది. డొమినికన్ రిపబ్లిక్ ఆఫ్ గ్వాడెలోప్ అండ్ మేరీ గలాంటే. ఈ ద్వీపం రాజధాని పేరు రోజ్. ఈ దేశం భారతీయలకు 6 నెలలు వీసా ఫ్రీ ఎంట్రీ ఇస్తోంది. అందమైన ప్రకృతి, అందమైన పర్వతాలకు ప్రసిద్ధి. ఇక్కడ మెజార్టీ జనాభా ఆఫ్రికన్లు. 

కెన్యా

విదేశాలకు వెళ్లాలనుకుంటే కెన్యా మరో అద్భుతమైన ప్రదేశం. జనవరి 1, 2024 నుంచి కెన్యా కూడా వీసా ఫ్రీ చేసింది. అందమైన ప్రకృతి, జీవ వైవిద్యం, ప్రాచీన నాగరికత, ఆధునిక నాగరికతకు కెన్యా చిహ్నం. కెన్యా రాజధాని నైరోబి సముద్రమట్టానికి 2 వేల మీటర్ల ఎత్తులో ఉండే నగరం. ఈ నగరంలో ఉండే 1.5 మిలియన్ల జనాభాలో 1 మిలియన్ జనాభా భారతీయులే కావడం విశేషం.

ఇండోనేషియా

ప్రపంచంలోనే అద్భుతమైన, అందమైన ద్వీపాలు చూడాలంటే ఇండోనేషియా వెళ్లాల్సిందే. ఇండోనేషియా కంటే అందమైన దేశం మరొకటి లేదంటే ఆశ్చర్యం లేదు. ఈ దేశం కొత్తగా 30 రోజుల వీసా ఫ్రీ ఎంట్రీ కల్పిస్తోంది. జావా, సుమత్రా, బాలి దీవులు, అక్కడి అందమైన్ బీచ్‌లు చూడదగ్గవి. 

 

Leave a Comment