Viral Video: వావ్.. చిన్నారిని ఎంతో ప్రేమగా లాలించిన ఆవు

ఆవు.. ఎంతో పవిత్రంగా పూజించే జంతువు.. ఆవుల్లో సకల దేవతలు కొలువై ఉంటారని నమ్ముతారు. అందుకే చాలా మంది ఆవులను ఎంతో ప్రేమగా పెంచుకుంటారు. తాజాగా ఇంట్లో పెంచుకుంటున్న ఓ ఆవు.. ఆ ఇంటి చిన్నారి పట్ల అంతులేని ప్రేమను కురిపించింది. తాజాగా దీనికి సంబంధించి వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. చిన్నారి పాపను ఆవు లాలించిన విధానాన్ని చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. అంతేకాకుండా ఈ వీడియోపై కామెంట్లు వర్షం కూడా కురిపిస్తున్నారు.
వీడియో ఓపెన్ చేస్తే.. ఓ ఇంటి ఆవరణలో మంచంపై ఓ చిన్నారి ఆడుకుంటూ ఉంటుంది. చిన్నారి ఒక్కటే ఉండడాన్ని గమనించిన ఓ ఆవు .. వెంటనే మంచం వద్దకు వెళ్తుంది. ఆ చిన్నారిని ప్రేమగా ముద్దుడుతూ తన ప్రేమను కురిపిస్తుంది. ఆ పాప చిరునవ్వులు చిందిస్తూ.. ఆవుతో ఆడుకుంటోంది. తాజాగా ఆవు పసి బిడ్డను లాలిస్తున్న వీడియో నెటిజన్స్ హృదయాన్ని హత్తుకుంటుంది. ఈ వీడియోపై రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియా చాలా ముద్దుగా ఉందని ఓ యూజర్ కామెంట్ చేయగా.. ఈ ఘటన నాకు ఆవులను ప్రేమించడం నేర్పిందని మరోక యూజర్ కామెంట్ చేశారు. ఆ వీడియో మీరు చూడండి..

 

View this post on Instagram

 

A post shared by Jaynti l (@gopalak_jay)

Leave a Comment