Viral Video: వృద్ధుడిపై హైనా ఎలా దాడి చేసిందో చూడండి..!

రోడ్డుపై వెళ్తున్న ఓ వృద్ధుడిపై హైనా ఒక్కసారిగా దాడి చేసింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మహారాష్ట్రలోని పూనెలోని ఖేడ్ ప్రాంతంలో ఓ వృద్ధుడు చేతిలో బకెట్ పట్టుకుని రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్నాడు. అంతలో అటుగా చెట్ల పొదల్లోంచి ఓ హైనా ఒక్కసారిగా వచ్చి వృద్ధుడి చేయి పట్టుకుంది. అతడిపై దాడి చేయడం ప్రారంభించింది. 

పక్కనే ఉన్న ఓ యువకుడు వృద్ధుడి చేతిలోని కర్ర తీసుకుని హైనాని కొట్టడం మొదలుపెట్టాడు. మొదట్లో దెబ్బలను తట్టుకొని మరీ దాడి చేసిన హైనా చివరికి అక్కడి నుంచి పారిపోయింది. గాయపడ్డ బాధితులిద్దరూ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. హైనా దాడి చేసిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి. ఈ ఘటనపై స్పందించిన అటవీ అధికారులు గాయపడిన ఇద్దరికీ పరిహారం అందిస్తామని హామీ ఇచ్చారు. అయితే హైనాకు సింహం ఎముకలైనా పిండి చేయగల శక్తి ఉంటుంది. ఆ వృద్ధుడు అదృష్టవంతుడనే చెప్పాలి..    

Leave a Comment