పిల్లలను డెంగ్యూ నుంచి ఇలా కాపాడుకోండి..!

ఈ సీజన్ లో సహజంగానే అనేక రకాల విష జ్వరాలు వస్తుంటాయి. వాటిలో డెంగ్యూ కూడా ఒకటి. ప్రస్తుతం ఏ జ్వరం వచ్చినా డెంగ్యూ అని భయపడిపోతున్నారు. అయితే డెంగ్యూ జ్వరానికి, కరోనాకు మధ్య కొంత వ్యత్యాసం ఉంటుంది. శ్వాసలోపం, ఛాతీ నొప్పి, ఇంకా శ్వాస సమస్యలు లేకపోతే అది డెంగ్యూ కాదు.

 ప్రస్తుతం డెంగ్యూ ముఖ్యంగా పిల్లలపై ఎక్కువ ప్రభావం చూపుతోంది. అందుకు ముందుజాగ్రత్తలు పాటిస్తే దీని బారి నుంచ బయటపడవచ్చు. డెంగ్యూ జ్వరం వచ్చిన 70 శాతం మందికి సాధారణ చికిత్స అందిస్తారు. కానీ, ప్లేట్ లెట్స్ సంఖ్య తగ్గకుండా ఉండాలి. శరీరంలో నీటి శాతం తగ్గకుండా మెయిన్ టెన్ చేయాలి. కాంప్లికేట్ అయితేనే ప్రాణాంతకం అవుతుంది. 

పిల్లలను డెంగ్యూ నుంచి రక్షించే విధానం:

  • పిల్లలు ఆడుకునేటప్పుడు లేదా ఇంట్లో ఉన్న మస్కిటో రెప్పలెంట్ అప్లయి చేసి ఉంచాలి. అయితే రెండు నెలలపైబడిన పిలల్లకు మాత్రమే అప్లయి చేయాలి. 
  • ముఖ్యంగా డీట్ ఉండే మస్కిటో రెప్పలెంట్ వాడటం మంచిది. ఉదయం దీన్ని అప్లయి చేస్తే సాయంత్రం వరకు పిల్లలకు ప్రొటెక్షన్ ఇస్తుంది. 
  • లెమన్, యూకలిప్టస్ ఆయిల్ నేచురల్ రెప్పలెంట్స్, సిట్రనల్ ఆయిల్ బేస్ ఉన్న మస్కిటో రెప్పలెంట్స్ మార్కెట్లో ఎక్కువగా అందుబాటులో ఉన్నాయి. 
  • ఒడోమస్ వంటి మూడేళ్లు పైబడిన పిల్లలకు మాత్రమే వైద్యులు సిఫార్స్ చేస్తారు. 
  • కానీ నేచురల్ ప్రొడక్ట్స్ అన్ని 4-6 గంటలు మాత్రమే ప్రొటెక్షన్ ఆస్తాయి. 
  • ముఖ్యంగా దోమలు మన శరీరం నుంచి విడుదలయ్యే కార్బన్ డై ఆక్సైడ్ ద్వారా గుర్తిస్తాయి. ఈ మస్కిటో రెప్పలెంట్స్ వాస ఉంటే దోమలు గుర్తించలేవు. ఈ వాసన వాటికి పడవు. 
  • కొంతమందికి ఎక్కువ దోమలు కుడతాయి. వారు కచ్చితంగా రెప్పలెంట్ వాడాలి. 
  • డే టైంలో కూడా దోమల నివారణకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. 
  • దోమ తెరలు వాడటం చాలా మంచిది.

 

Leave a Comment