‘బుల్లెట్ బండి’ పాటకు ఏపీ డిప్యూటీ సీఎం భార్య డ్యాన్స్..!

ఇటీవల బుల్లెట్ బండి పాట ఎంతో పాపులర్ అయింది. మంచిర్యాల పెళ్లికూతురు డ్యాన్స్ చేసిన తర్వాత ఈ పాటకు మరీ హైప్ వచ్చేసింది. దాదాపు ప్రతి పెళ్లిలోనూ ఇదే పాట వినబడుతోంది. ‘నీ బుల్లెట్ బండెక్కి వచ్చెత్తాపా.. డుగ్గు.. డుగ్గు’ అంటూ చిన్నా పెద్దా తేడా లేకుండా స్టెప్పులేస్తున్నారు.. 

తాజాగా ఏపీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి సతీమణి బుల్లెట్ బండి పాటకు డ్యాన్స్ చేశారు. మంత్రి నారాయణ 42 వివాహ వార్షికోత్సవాన్ని తిరుపతిలోని ఆయన నివాసంలో కుటుంబ సభ్యుల మధ్య జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆయన భార్య బుల్లెబ్ బండి పాటకు భర్త ముందు స్టెప్పులు వేశారు. ఆమె డ్యాన్స్ ను కుటుంబ సభ్యులంతా ఆస్వాదించారు. ప్రస్తుతం ఈ డ్యాన్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.   

Leave a Comment