ఆ చిన్నారి ప్రేమకు ఫిదా అవ్వాల్సిందే..!

సోషల్ మీడియాలో ప్రతిరోజూ ఎన్నో వీడియోలు వైరల్ అవుతుంటాయి.. వాటిలో కొన్ని వీడియోలు మాత్రం నిజ జీవితాన్ని ప్రతిబించేలా ఉంటాయి. అలాంటి వీడియోలు నెటిజన్ల హృదయాలను కదిలిస్తుంటాయి.. అటువంటి ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది..

తండ్రీ కూతుళ్ల మధ్య ప్రేమ, ఆప్యాయత, అనురాగం అనుబంధం ఎప్పటికీ తగ్గదు.. అలసిపోయిన ఓ తండ్రికి అపారమైన ప్రేమతో కూతురు పండ్లు తినిపించింది. పండు తిన్న తర్వాత తండ్రి తన కూతురిని అప్యాయంగా హత్తుకున్నాడు. అలా ఆ తండ్రీకూతుళ్ల ప్రేమకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.. ముంబై లోకల్ ట్రైన్ లో ఈ మధుర ఘటన జరిగింది.   

 

 

Leave a Comment