సాధించాలన్న కసి ఉంటే ఎక్కడైనా సాధ్యం.. ఏటీఎం సెంటర్ లో ప్రిపేర్ అవుతున్న సెక్యూరిటీ గార్డు.. !

ఏదైనా సాధించాలంటే లక్ష్యం ఒక్కటే ఉంటే సరిపోదు.. అందుకు తగ్గ పట్టుదల, సాధించాలన్న కసి ఉండాలి. జీవితంలో ఎదురయ్యే కష్టాలను సైతం మన విజయానికి వారధిగా వాడుకోవాలి.. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ సెక్యూరిటీ గార్డు ఫొటో వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి ఏటీఎమ్ సెంటర్ లో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు. 

తన చదువుకు, అర్హతకు సరిపోని ఉద్యోగం అది.. అయితే తన చదువుకు, అర్హతకు సరిపోయే మంచి ఉద్యోగం సాధించాలనుకున్నాడు. ఓ వైపు సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తూనే, మరో వైపు పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నాడు. ఏటీఎమ్ సెంటర్ లో పుస్తకం పట్టుకొని చదువుకుంటున్న ఆ సెక్యూరిటీ గార్డు ఫొటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

ఛత్తీస్ గఢ్ క్యాడర్ కు చెందిన అవనిష్ శరన్ అనే ఐఎఎస్ అధికారి తన ట్విట్టర్ ఖాతాలో ఈ ఫొటోను పోస్ట్ చేశారు. ఎక్కడైనా జ్వాల ఉంటుంది.. కానీ దానిని వెలిగించడానికి మాత్రమే ఉపయోగించాలి అంటూ క్యాప్షన్ కూడా జోడించారు. తన కలలను సాకారం చేసుకునేందుకు సెక్యూరిటీ గార్డు చేస్తున్న కృషి నెటిజన్లు సెల్యూట్ చేస్తున్నారు.   

Leave a Comment