పవన్ సినిమా అంటే కూడా జగన్ భయపడుతున్నారు : బీజేపీ నేతలు

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే తెలుగు ప్రేక్షకుల్లో ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పవన్ కళ్యాణ్ నటించిన ‘వకీల్ సాబ్’ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మొదటి షోతోనే మంచి రెస్పాన్స్ తో దూసుకుపోతోంది. అయితే ఏపీలో ‘వకీల్ సాబ్ బెనిఫిట్ షోలు రద్దు చేశారు. దీంతో పవన్ అభిమానులు, జనసైనికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా తిరుపతిలోని పలు థియేటర్లపై దాడులకు పాల్పడ్డారు. టికెట్లు విక్రయించి బెనిఫిట్ షో వేయకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ థియేటర్లపై రాళ్లు రువ్వారు. 

మరో వైపు వకీల్ సాబ్ స్పెషల్ షో రద్దు అంశం ఇప్పుడు రాజకీయ రంగు పులుముకుంటోంది. షో రద్దుపై జనసేనతో పాటు బీజేపీ నేతలు కూడా మండిపడుతున్నారు. తిరుపతిలోని ఓ థియేటర్లో సినిమా చేసేందుకు వెళ్లిన ఏపీ బీజేపీ వ్యవహారాల సహ ఇన్ ఛార్జ్ సునీల్ దియోధర్.. షో రద్దు చేయడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు.  

ఏపీ సీఎం జగన్ కు పవన్.. వకీల్ సాబ్ భయం పట్టుకుందని సునీల్ దియోధర్ అన్నారు. వకీల్ సాబ్ బెనిఫిట్ షోలు ఎందుకు రద్దు చేశారని ప్రశ్నించారు. పవన్ అంటేనే కాదు, ఆయన సినిమా అంటూ కూడా జగన్ భయపడుతున్నారని అన్నారు. తిరుపతిలో పవన్ కవాతు చేసినప్పుడు అసలు సినిమా రిలీజైందన్నారు. 

ప్రతి శుక్రవారం నాంపల్లి కోర్టుకు వెళ్లి హాజరు వేయించుకునే అలవాటు ఉన్న వాడే కదా వకీల్ సాబ్ ను చూసి భయపడేది అని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. ప్రజలందరూ వకీల్ సాబ్ సినిమా చూడాలని బీజేపీ నేత పిలుపునిచ్చారు.   

Leave a Comment