త్వరలోనే భారత్ లో సింగిల్ డోస్ వ్యాక్సిన్..!

దేశంలో అతి తర్వరలో మరో కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి రాబోతుంది. అమెరికాకు చెందిన జాన్సన్ & జాన్సన్ కు డీసీజీఐ అనుమతి ఇచ్చింది. భారత్ లో రెండో దశ క్లినికల్ ట్రయల్స్ నిర్వహించేందుకు జాన్సన్ & జాన్సన్ సంస్థకు అనుమతి లభించింది. అమెరికాలో ఇప్పటికే పెద్ద ఎత్తున వ్యాక్సిన్ వినియోగిస్తున్నారు. 

కరోనా నియంత్రణలో తమ వ్యాక్సిన్ చాలా చక్కగా పనిచేస్తుందని సంస్థ ప్రకటించింది. మిగితా వ్యాక్సిన్ లతో పోలిస్తే ఈ టీకా విభిన్నం. ఎందుకంటే ఈ టీకా సింగిల్ డోస్ వేసుకుంటే సరిపోతుంది. అమెరికాలో సక్సెస్ రేట్ ఎక్కువ కావడంతో ఈ వ్యాక్సిన్ వేసుకోవడానికి జనం చాలా ఆసక్తి చూపిస్తున్నారు. యూఎస్ క్లినికల్ ట్రయల్స్ లో ఈ వ్యాక్సిన్ 72 శాతం సమర్థవంతంగా పనిచేస్తున్నట్లు తేలింది. 

ఈ వ్యాక్సిన్ వేసుకున్న వాళ్లలో కోవిడ్ తో చనిపోయిన వారు ఎవరూ లేరు.ఈ వ్యాక్సిన్ వేసుకున్న 28 రోజుల తర్వాత సమర్థవంతంగా పనిచేస్తుందని, తీవ్ర అస్వస్థత  ప్రమాదాన్ని 85 శాతం మేర అరికట్టిందని సంస్థ వెల్లడించింది. దీంతో భారత్ లో కూడా సింగిల్ డోస్ కరోనా వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ ప్రారంభించడానికి జాన్సన్ & జాన్సన్ సిద్ధమవుతోంది.  

Leave a Comment