‘ఆర్ఆర్ఆర్’ సీక్వెల్ వస్తుంది.. రాజమౌళి తండ్రి క్లారిటీ..!

ఇప్పుడు దేశంలో ఎక్కడ చూసినా ‘ఆర్ఆర్ఆర్’ హవా కొనసాగుతోంది.. మార్చి 25న రిలీజ్ అయిన ఈ సినిమా రికార్డులు క్రియేట్ చేస్తోంది.. ఇప్పటికే రూ.710 కోట్లు(గ్రాస్) వసూళ్లు చేసి సరికొత్త రికార్డు సృష్టించింది. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ సినిమాలో.. అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్. కొమురం భీమ్ గా ఎన్టీఆర్ ఆకట్టుకున్నారు. 

ఈ సినిమాకు రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్ కథను అందించారు. ఎన్నో వైవిధ్యభరిత కథలకు ఆయన రచయితగా ఉన్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ‘ఆర్ఆర్ఆర్’ సీక్వెల్ పై ఆయనకు ఓ ప్రశ్న ఎదురైంది. దీంతో ఆర్ఆర్ఆర్ సీక్వెల్ పై విజయేంద్ర ప్రసాద్ స్పందించారు. 

ఓ రోజు ఎన్టీఆర్ తమ ఇంటికి వచ్చి ఆర్ఆర్ఆర్ సీక్వెల్ గురించి అడిగారని విజయేంద్ర ప్రసాద్ అన్నారు. తాను కొన్ని ఐడియాలను చెప్పానని, అవి ఎన్టీఆర్, రాజమౌళికి బాగా నచ్చాయని తెలిపారు. దేవుడి దయ ఉంటే భవిష్యత్తులో సీక్వెల్ వస్తుందని విజయేంద్ర ప్రసాద్ చెప్పుకొచ్చారు. ఇక మహేశ్ బాబు సినిమాకు రూ.800 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నట్లు వార్తలు వచ్చాయి.. దీనిపై ప్రశ్నలకు విజయేంద్ర ప్రసాద్ సమాధానం చెబుతూ.. ఇంకా కథే సిద్ధం చేయలేదని, అప్పుడే బడ్జెట్ ఎలా అంచనా వేస్తారని అన్నారు. అవన్నీ అబద్ధపు ప్రచారం అని, కథ సిద్ధం చేస్తున్నానని అన్నారు. 

Leave a Comment