‘లైగర్’ గా విజయదేవరకొండ.. ఫస్ట్ లుక్ సూపర్..!

విజయదేవరకొండ, అనన్య పాండే హీరోహీరోయిన్లుగా దర్శకుడు పూరీ జగన్నాథ్ సినిమా తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే.. ఈ సినిమాను పూరీ, చార్మీ, కరణ్ జోహార్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు మొన్నటి వరకు ఫైటర్ అనే పేరును ప్రచారం చేశారు. కానీ ఇటీవల బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ తన కొత్త సినమాకు ఫైటర్ పేరును ఖరారు చేశాడు. 

దీంతో పూరీ తన సినిమాకు మరో పేరును వెతెకున్నాడు. కాగా సోమవారం ఈ సినిమా ఫస్ట్ లుక్, టైటిల్ ను సినిమా యూనిట్ విడుదల చేసింది. ఎంతో భిన్నంగా ‘లైగర్’ అనే టైటిల్ ను ఖరారు చేశారు. సాలా క్రాస్ బ్రీడ్ అనేది ఉపశీర్షిక.. ఈ ఫస్ట్ లుక్ లో బాక్సర్ గ్లౌవ్స్ వేసుకొని పవర్ పంచ్ కొట్టేందుకు విజయ్ సిద్ధంగా ఉన్నట్లు ఉంది. ఈ సినిమా కోసం విజయ్  థాయ్ లాండ్ లో ప్రత్యేక శిక్షణ కూడా తీసుకున్నాడు. 

కాగా లైగర్ అంటే మగ సింహం, ఆడ పులిల సంతానం. ఇవి సింహం, పులి కన్నా చాలా పెద్దగా ఉంటాయి. ఇవి సింహాల్లానే గర్జిస్తాయి. ఈ సినిమా పోస్టర్ అందరినీ ఆకట్టుకునే విధంగా డిజైన్ చేశారు. ఈ సినిమా భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కిస్తున్నారు. వరల్డ్ ఫేమస్ లవర్ డిజాస్టర్ కావడంతో ఈసారి ఎలాగైనా హిట్ కొట్టాలన్న కసి మీద ఉన్నాడు విజయ్..అందు కోసం మళ్లీ ప్రేమ కథల జోలికి పోకుండా కొంత వినూత్నంగా లైగర్ తో స్పోర్ట్స్ బ్యాగ్రౌండ్ కథను ఎంచుకున్నాడు.     

Leave a Comment