Video Viral : ‘కచ్చా బాదామ్’ పాటకు పోలీసులు స్టెప్పులు..!

సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ‘కచ్చా బాదామ్’ హల్ చల్ చేస్తోంది.. చిన్నాపెద్ద తేడా లేకుండా అందరినీ ఆకట్టుకుంటోంది.. తాజాగా ఈ పాటకు పోలీసులు కూడా స్టెప్పులేశారు.. పశ్చిమ బెంగాల్ లోని భీర్భూమ్ ప్రాంతంలో పల్లీలు అమ్ముకొనే భుబన్ బద్వకార్ ప్రజలను ఆకట్టుకునేందుకు అల్లిన పాటే ఈ కచ్చా బాదం.. 

ఈ పాట ఇప్పుడు బాగా పాపులర్ అయ్యింది. ఈ పాట సోషల్ మీడియాను ఓ ఊపు ఊపేస్తోంది.. ఈ పాటకు క్రేజ్ ఎంత పెరిగిందంటే.. సెలబ్రిటీల నుంచి అధికారుల వరకు అందరూ కచ్చా బాదం పాటకు ఫిదా అవుతున్నారు. కచ్చా బాదం అంటూ స్టెప్పులేస్తున్నారు.

తాజాగా ఈ పాటకు పోలీసులు కూడా ఫిదా అయ్యారు. తమ లాఠీలు పక్కనపెట్టి కచ్చాబాదం అంటూ స్టెప్పులేశారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఒక మహిళా పోలీస్ అధికారితో పాటు మరో నలుగురు పోలీసులు సరదాగా కాలు కదిపారు. ‘ఖాళీలు ఎందుకు సరదాగా ఉండకూడదు’ అనే క్యాప్షన్ పెట్టారు. ఈ వీడియో నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది..    

 

 

 

 

Leave a Comment