ట్రయల్ రూంలో యువతి డ్రెస్ మార్చుకుంటుండగా..సీక్రెట్ వీడియో రికార్డింగ్..

షాపింగ్ మాల్ కి వెళ్తున్నారా.. అయితే జాగ్రత్త.. మీరు ట్రయల్ రూంకి వెళ్లినప్పుడు అన్ని ఒకసారి చెక్ చేసుకోండి.. ఎందుకంటే మూడో కన్ను మీపై నిఘా పెట్టి ఉండొచ్చు.. అమ్మాయిలు అయితే మరీ జాగ్రత్తగా ఉండాలి.. కొందరు పోకిరీలు సీక్రెట్ కెమెరాల ద్వారా వీడియోలు తీసుకున్నారు.. తాజాగా హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని హెచ్ అండ్ ఎం షాపింగ్ మాల్ ట్రయల్ రూంలో యువతి డ్రెస్ మార్చుకుంటుండగా ఇద్దరు యువకులు వీడియో తీశారు.. ఈ విషయాన్ని యువతి గమనించి గట్టిగా కేకలు వేసింది. దీంతో మాల్ సిబ్బంది ఆ ఇద్దరు యువకులను పట్టుకుని పోలీసులకు అప్పగించింది. 

జూబ్లీహిల్స్ లోని హెచ్ అండ్ ఎం షాపింగ్ మాల్ లో ఓ యువతి దీపావళి షాపింగ్ కోసం వెళ్లింది. అక్కడ కొన్ని డ్రెసెస్ సెలెక్ట్ చేసుకొని ట్రయల్ చేద్దామని ట్రయల్ రూంలోకి వెళ్లింది. ఆ సమయంలో ఇద్దరు యువకులు ఆమెను సీక్రెట్ గా వీడియో తీస్తున్నారు. అది గమనించిన యువతి గట్టిగా కేకలు వేసింది. దీంతో మాల్ సిబ్బంది ఇద్దరిని పట్టుకుని 100కి కాల్ చేసి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు అక్కడికి చేరుకుని యువకులను అదుపులోకి తీసుకున్నారు.  

ఈక్రమంలో సీక్రెట్ గా రికార్డ్ చేసిన యువతి వీడియోను డిలీట్ చేయించారు. మొబైల్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మొబైల్ ని పరిశీలించగా.. ఇలాంటి వీడియోలు ఇంకా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. పోలీసులు ఇద్దరు నిందితులతో పాటు షాపింగ్ మాల్ స్టోర్ మేనేజర్ పై కూడా కేసు నమోదు చేశారు. ప్రస్తుతం నిందితులను విచారిస్తున్నారు.  

Leave a Comment