బరువు తగ్గించే మెడిసిన్.. క్యూ కట్టిన జనాలు..!

తినేటప్పుడు ఏమో ఆలోచించరు.. బరువు పెరిగాక తగ్గేందుకు నానాతిప్పలు పడుతుంటారు. వ్యాయామాలు.. రెమెడీలు.. మందులు ఇలా బరువు తగ్గేందుకు రకరకాలుగా ప్రయత్నాలు చేస్తుంటారు.. అయితే బరువు తగ్గింగే మందులు గతంలోనూ వచ్చినా.. అవి దుష్ప్రభావాలు కలిగిస్తుండటంతో వాటికి నియంత్రణ సంస్థల నుంచి అనుమతి లభించలేదు.. 

ఈక్రమంలో అమెరికాలో బరువు తగ్గించే మందుకు గ్రీన్ సిగ్నల్ లభించింది. తొలిసారిగా నోవో నోర్డిస్క్ అనే ఫార్మ కంపెనీ తయారు చేసిన ‘వీగోవీ’ అనే మందుకు అమెరికాలో అనుమతి లభించింది. దీంతో ఆ మందు కొనేందుకు జనాలు మెడికల్ షాపులకు క్యూ కడుతున్నారు. అయితే డిమాండ్ కు తగ్గట్టు ఆ మందును సరఫరా చేయలేకపోతున్నారు. 

వీగోవీ మందును ఇంజెక్షన్ రూపంలో తీసుకోవాలి. ఇది ఆకలిని నియంత్రిస్తుంది.. కాబట్టి బరువు తగ్గేందుకు ఇది దోహదపడుతుంది. దాదాపు 15 శాతం బరువు తగ్గే అవకాశముందని సంస్థ తెలిపింది. ఇది వారానికి ఒక డోసు చొప్పున తీసుకోవాలి. ఔషధం తీసుకున్న తర్వాత ఇది మెదడులోని ఆకలిని, ఆహారం తీసుకోవడం నియంత్రించే ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుంటుంది. అయితే దీనికి వల్ల కొన్ని సైడ్ ఎఫెక్ట్స కూడా ఉన్నాయి. వాంతులు, యాసిడ్ పీఫ్లక్స్ వంటి సైడ్ ఎఫెక్ట్స్ ఈ మందు వాడిన వారిలో కనినిస్తున్నట్లు సమాచారం. 

Leave a Comment