ఈ లక్షణాలు కనిపిస్తే.. మీకు డయాబెటీస్ ఉన్నట్లే..!

ప్రస్తుతం చిన్న వయస్సులోనూ డయాబెటీస్ వ్యాధితో చాలా మంది బాధపడుతున్నారు. జీవిన శైలిలో మరియు ఆహారంలో మార్పుల వల్ల ఎప్పుడో 50 ఏళ్లు నిండిన వారికి వచ్చే వ్యాధి అంతకన్నా త్వరగానే వచ్చేస్తుంది. డయాబెటీస్ సాధారణ వ్యాధే కావచ్చే. కానీ ఒకసారి వస్తే మాత్రం జీవిత కాలం అది బాధపెడుతోంది..

డయాబెటీస్ ముఖ్యంగా 3 రకాలు.. టైప్-1, టైప్-2, గెస్టేషనల్.. వీటిలో టైప్-1, టైప్-2 ముఖ్యమైనవి.. గర్భధారణ సమయంలో వచ్చే మధుమేహాన్ని గెస్టేషనల్ అంటారు. టప్-1 డయాబెటీస్ పిల్లలకు, యువకులకు ఎక్చువగా వచ్చే అవకాశం ఉంటుంది. వీరు ఇన్సులిన్ ను వాడాల్సి ఉంటుంది. టైప్-2 డయాబెటీస్ అసహజ జీవన శైలి, వంశపారంపర్యంగా వస్తుంది. ఇది వెంటనే బయటపడదు..

డయాబెటీస్ ను గుర్తించడం ఎలా?

టైప్ -2 డయాబెటీస్ బయటపడటానికి ఎక్కువ సమయం పడుతుంది. పదేళ్ల ముందు నుంచి కొందరిలో దాని లక్షణాలు కనిపిస్తాయి. ఆ లక్షణాల ఆధారంగా డయాబెటీస్ ను గుర్తించ వచ్చు. తరచూ మూత్ర విసర్జనకు వెళ్లడం, తరచు దాహం వేయడం, అలసట, చూపు మసకబారటం, గాయాలు త్వరగా మానకపోవడం, అధికంగా ఆకలి వేడయం, ఆకస్మిక బరువు పెరగడం లేదా తగ్గడం వంటివి డయాబెటీస్ లక్షణాలు.. ఇంకా కొంత మందికి కాళ్లు తిమ్మర్లు ఎక్కుతాయి. కాళ్లలో స్పర్శ తగ్గుతుంది. కొందరిలో తరచు ఆయాసం, వాంతులు, విరేచనాలు, చర్మం, మర్మావయాల వద్ద ఇన్ఫెక్షన్లు కనిపించవచ్చు. వృషణాల దురద, అంగంలో మంటగా ఉండటం, సెక్స్ కోరికలు సన్నగిల్లడం, చర్మం ముడతలు పడటం వంటి లక్షణాలు కూడా కనిపిస్తాయి. ఇలాంటి లక్షణాలు కనిపించినప్పుడు డాక్టర్ ని సంప్రదించాలి. 

ఇంకో విషయం చక్కెర వల్ల డయాబెటీస్ వస్తుందని చాలా మంది భావిస్తారు. కానీ అది ఒక అపోహ మాత్రమే.. షుగర్ వ్యాధికి, షుగర్ కు ప్రత్యక్ష సంబంధం ఏమీ లేదు. అయితే చక్కెర ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరం బరువు పెరుగుతుంది. అధిక బరువు ఆరోగ్యానికి మంచిది కాదు. స్థూలకాయం వల్ల కూడా డయాబెటీస్ వచ్చే అవకాశం ఉంది.   

 

Leave a Comment