వెలుగు వాట్సాప్ గ్రూపులో పోర్న్ వీడియో.. షాకైన మహిళలు..!

ఈరోజుల్లో ప్రతి ఒక్కరూ సోషల్ మీడియాతో కనెక్ట్ అయి ఉన్నారు. ఏదైన సమాచారం పంచుకోవాలన్నా సోసల్ మీడియానే ఉపయోగిస్తున్నారు. వాట్సాప్, టెలిగ్రామ్ వంటి సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా సమాచారాన్ని పంచుకుంటున్నారు. 

ఈక్రమంలో సమాచారాన్ని షేర్ చేసుకునేందుకు మహిళ ద్వారా ఏర్పడిన స్వయం సహాయక సంఘాలు కూడా వాట్సాప్ గ్రూపును ఏర్పాటు చేసుకున్నాయి. ఈ వెలుగు వాట్సాప్ గ్రూపులో ఓ అధికారి పోర్న్ వీడియో పోస్ట్ చేశాడు. ఈ ఘటన కృష్ణా జిల్లా చాట్రాయి మండలంలో చోటుచేసుకుంది. 

వెలుగు గ్రూపుకు చెందిన మహిళలంతా కలిసి ఓ వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసుకున్నారు. ఆ గ్రూప్ లో మొత్తం మహిళలే ఉన్నారు. వారు తమ విధులకు అవసరమైన సమాచారాన్ని ఆ గ్రూపులో షేర్ చేసుకుంటారు. 

కాగా, బుధవారం రాత్రి ఆ గ్రూపులో అసభ్యకరమైన ఓ పోర్న్ వీడియో ప్రత్యక్షమైంది. ఆ వీడియో చూసిన మహిళలందరూ షాకయ్యారు. అయితే పొరపాటున అభ్యంతకర వీడియో గ్రూపులో పంపినట్లు పేర్కొంటూ సదరు వెలుగు అధికారి మిగిలిన గ్రూపు సభ్యులందరికీ క్షమాపణలు చెప్పినట్లు సమాచారం.

తనకు ఎవరో పంపిన వీడియో పొరపాటున సంఘాల గ్రూపులోకి చేరిందని ఏపీఎం బాల సుబ్రహ్మణ్యం చెప్పారు. మహిళా సభ్యులకు తాను నేరుగా క్షమాపణ చెప్పినట్లు వెల్లడించారు. తాను కావాలని చేసిన తప్పు కాదని, పొరపాటుగా జరిగిందని తెలిపారు. అయితే కావాలని తాను తప్పు చేయకపోయినా కొందరు తనను అపఖ్యాతి చేసేలా స్క్రీన్ షాట్లు ఇతరులకు  పంపినట్లు వాపోయారు. 

Leave a Comment