పెట్రోల్ రేటు రూ.3 తగ్గించిన ప్రభుత్వం..!

తమిళనాడు ప్రభుత్వం ఆ రాష్ట్ర వాహనదారులకు గుడ్ న్యూస్ అందించింది. రోజురోజుకు పెరిగిపోతున్న పెట్రో ధరల నుంచి ఉపశమనం కలిగించేందుకు రాష్ట్రంలో పెట్రోల్ ధరలను తగ్గిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. లీటర్ పెట్రోల్ పై రూ.3 మేర సుంకం తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. ఈమేరకు ఆ రాష్ట్ర ఆర్థిక మంత్రి పళనివేల్ త్యాగరాజన్ ప్రకటించారు. సీఎం స్టాలిన్ ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు. 

లీటర్ పెట్రోల పై రూ.3 ధర తగ్గించడం వల్ల తమిళనాడు రాష్ట్ర ఖజానాకు రూ.1,160 కోట్ల నష్టం వస్తుందని, అయినా ప్రజా శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకన్నామని ఆర్థిక మంత్రి వెల్లడించారు.

ప్రస్తుతం తమిళనాడులో పెట్రోల్ ధర రూ.102.49 ఉంది. స్టాలిన్ సర్కార్ నిర్ణయంతో వంద రూపాయల కంటే తక్కవకు పెట్రోల్ లభించనుంది. అయితే ధరల తగ్గింపు ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుందనే దానిపై స్పష్టత లేదు. అలాగే డీజిల్ రేట్ల తగ్గింపుపై కూడా ఎలాంటి ప్రకటన రాలేదు. ఇక తమిళనాడు సర్కార్ తాజాగా తీసుకున్న ఈ నిర్ణయంపై వాహనదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.  

 

Leave a Comment