ప్రభాస్ కు  ఐ లవ్ యూ అని మెసేజ్ లు పంపించా..!

బిగ్ బాస్ నాలుగో సీజన్ లో పాల్గొని ఒక్కసారి తెలుగు ప్రేక్షకులను తనవైపు తిప్పుకుంది అందాల తార దివి వైద్య.. మహిర్షి సినిమాతో పాటు పలు సినిమాల్లో నటించినా అవి ఆమెకు పెద్దగా గుర్తింపు రాలేదు. కానీ బిగ్ బాస్ తో భారీగా ఫేమ్ ను సంపాదించుకుంది.. సోషల్ మీడియాలోనూ యాక్టివ్ గా ఉంటూ యూత్ లో మంచి క్రేజ్ సంపాదించుకుంది. ప్రస్తుతం హీరోయిన్ గానూ అవకాశాలు దక్కించుకుంది. 

తాజాగా ఓ మూవీ ప్రమోషన్ లో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో దివి పలు ఆసక్తికరమైన విషయాలు షేర్ చేసుకుంది. తనకు హీరో ప్రభాస్ అంటే ఎంతో ఇష్టమని, ఒక రకంగా చెప్పాలంటే ఆయనంటే క్రష్ అని చెప్పింది. మిర్చి సినిమాతో ప్రభాస్ కు ఫ్యాన్ అయిపోయానని, అప్పటి నుంచి ఆయనకు ఐ లవ్ యూ అంటూ ఇన్ స్టాగ్రామ్ లో మేసేజ్ లు చేస్తుండేదాన్ని అని పేర్కొంది. అంతేకాకుండా ఒకవేళ అవకాశం వస్తే ప్రభాస్ తో డేటింగ్ కు వెళ్తానని, మిర్చి లాంటి అబ్బాయితో కప్పు కాఫీ తాగినా చాలని చెప్పుకొచ్చింది. 

Leave a Comment