మనిషిని మోసుకెళ్లే ‘వరుణ’ డ్రోన్.. ఎయిర్ అంబులెన్స్ గా..!

మనిషిని మోసుకెళ్లే సరికొత్త ‘వరుణ’ డ్రోన్ ని తయారు చేశారు. 130 కిలోల బరువును ఎక్కడికైనా మోసుకెళ్లే సామర్థ్యం ఉన్న ఈ డ్రోన్ ని పూణెకి చెందిన Sagar Defense Engineeringఅనే స్టార్టప్ కంపెనీ తయారు చేసింది.. ఈ డ్రోన్ 130 కిలోల బరువుతో 25 కి.మీ. దూరం ప్రయాణించగలదు..   

ఈ డ్రోన్ ని రిమోట్ ద్వారా ఆపరేట్ చేస్తారు. ఒక చోటు నుంచి మరొక చోటుకు వెళ్లగలుగుతుంది. ఏదైనా సాంకేతి సమస్య వస్తే.. ఈ డ్రోన్ సురక్షితంగా ల్యాండ్ అయ్యే విధంగా ఆటోమెటిక్ గా పారాచూట్ తెరుచుకుంటుంది. 

మారుమూల ప్రాంతాలు, సమస్యాత్మక ప్రదేశాలు, విపత్తులు సంభవించిన ప్రాంతాల నుంచి వ్యక్తులను సురక్షితంగా బయటకు తీసుకొచ్చే విధంగా దోహదపడుతుందని కంపెనీ వ్యవస్థాపకుడు బబ్బర్ పేర్కొన్నారు.  ‘వరుణ’ డ్రోన్ ని ఎయిర్ అంబులెన్స్ గా కూడా ఉపయోగించవచ్చు.. అత్యవసర పరిస్థితి తలెత్తినప్పుడు గ్రామీణ ప్రాంతాల నుంచి రోగిని ఈ డ్రోన్ సహాయంతో ఆస్పత్రికి తరలించవచ్చు.. 

Leave a Comment