ప్రధాని మోడీకి రాఖి పంపిన పాక్ సోదరి.. ఆ బంధం ఎలా ఏర్పడింది? 

పాకిస్తాన్ కి చెందిన ఓ మహిళ ప్రధాని మోడీకి రాఖి పంపారు.. ప్రతి రక్షాబంధన్ కి క్రమం తప్పకుండా గత 25 ఏళ్లుగా పంపుతున్నారు. అసలు ప్రధాని మోడీ, పాకిస్తాన్ మహిళకు సంబంధం ఎలా ఏర్పడింది? ఇప్పుడు తెలుసుకుందాం.  ఆమె పేరు ఖమర్ మొహ్సిన్ షేక్..  రక్షాబంధన్ సందర్భంగా ప్రధాని మోడీకి రాఖి పంచింది. రాఖీతో పాటు ఓ లేఖ కూడా ఉంది. 2024 ఎన్నికల్లో విజయం సాధించాలని కోరుకుంది.. అంతేకాదు.. ప్రధాని మోడీ దీర్ఘాయుష్షు, ఆరోగ్యం కోసం, వచ్చే ఎన్నికల్లో విజయం సాధించాలని ప్రార్థించింది. 

 

ఈమె గత 25 ఏళ్లుగా ప్రధాని మోడీకి రాఖీ కట్టడమో లేదా పంపించడమో చేస్తున్నారు. ఈసారి ప్రధాని మోడీ తనను ఢిల్లీ పిలుస్తారని ఖమర్ మొహ్సిన్ ఆశాభావం వ్యక్తం చేసింది. దీని కోసం ఏర్పాట్లు కూడా చేసుకున్నట్లు చెప్పింది. తానే స్వయంగా రేష్మీ దారంతో రాఖీ తయారు చేశానని తెలిపింది.. 

 

పాక్ జాతీయురాలు అయిన ఖమర్ పెళ్లి తర్వాత అహ్మదాబాద్ లో ఉంటున్నారు. ఆమె భర్త గుజరాతీ.. 1981లో కుటుంబంతో సహా అహ్మదాబాద్ చేరుకుంది.. 1995లో అప్పటి గుజరాత్ గవర్నర్ డాక్టర్ స్వరూప్ సింహ్‌ను మొహ్సిన్ కలిశారు. ఆప్పుడా సమయంలో నరేంద్ర మోదీ కూడా ఉన్నారు. డాక్టర్ స్వరూప్ సింహ్ ఖమర్ మొహ్సిన్‌ను కుమార్తెగా భావించేవారు. ఆమెను జాగ్రత్తగా చూసుకోవాలని గవర్నర్ స్వరూప్ సింహ్…నరేంద్ర మోదీని కోరారు. వెంటనే మోదీ..మీకు కుమార్తె అయితే..నాకు సోదరి లాంటిదని చెప్పారని ఖమర్ మొహ్సిన్ చెప్పారు. 1996 నుంచి మోదీకు రాఖీ కడుతోంది. 

 

 

 

 

Leave a Comment