ఉచితాలపై సుప్రీంలో ‘ఆప్’ పిటిషన్..!

ప్రజలకు ఉచిత పథకాలు అందిస్తే తప్పేంటని ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ప్రశ్నించారు.. ఉచిత పథకాలపై మాజీ బీజేపీ నాయకుడి పిటిషన్ ను వ్యతిరేకిస్తూ ఆమ్ ఆద్మీ పార్టీ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.. సంక్షమ పథకాలను ఉచితాలుగా చూడొద్దన్నారు. సమాజంలో సమానత్వంలో కోసమే ఉచిత పథకాలు అందిస్తున్నామన్నారు.. దేశంలో సంక్షేమ పథకాలను మరింత బలోపేతం చేయకుండా..బీజేపీ వాటిపై వ్యతిరేక వాతావరణాన్ని సృష్టిస్తోందని ఆగ్రమం వ్యక్తం చేశారు. 

ఉచితంగా విద్య, విద్యుత్తు, నీళ్లు అందించడం నేరంగా బీజేపీ నేతలు చూపిస్తున్నారని మండిపడ్డారు. బీజేపీ మాత్రం తమ సన్నిహితులకు లక్షల కోట్ల రుణాలు మాఫీ చేసిందన్నారు. ఇలాంటి వారిపై విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న విద్యుత్ చట్టంలో సవరణలు ప్రమాదకరమని కేజ్రీవాల్ ఆరోపించారు. ఈ సవరణలు ప్రజలకు ఇబ్బందులు, కొన్ని కంపెనీలకు లాభం చేకూరస్తాయని అన్నారు. వాటిని విరమించుకోవాలని కోరారు. 

 

Leave a Comment