వాలెంటైన్స్ డే రోజు భార్యకు లాటరీ టికెట్ ఇస్తే కోప్పడింది.. అదే లాటరీ రూ.10 కోట్లు తెచ్చింది..!

వాలెంటైన్స్ డే రోజున లవర్స్, భార్యాభర్తలు చిరకాలం గుర్తుండిపోయే గిఫ్ట్ ను ఇస్తారు.. కొంత మంది ఖరీదైనా గిఫ్ట్ ఇచ్చి తమ ప్రేమను వ్యక్తపరుస్తుంటారు. కానీ ఓ భర్త మాత్రం తన భార్యకు ఓ లాటరీ టికెట్ ని బహుమతిగా ఇచ్చాడు. అది చూసిన భార్యకు చిర్రెత్తిపోయింది. భర్తపై మండిపడింది. కానీ అదే లాటరీ టికెట్ రూ.10 కోట్లు రావడంతో ఆమె ఆనందానికి అవధుల్లేకుండా పోయింది.

ఆస్ట్రేలియాలోని హేమార్కెట్లో నివాసం ఉంటున్న మరియా చికాస్ అనే మహిళకు వాలెంటైన్స్ రోజు సందర్భంగా ఆమె భర్త ఓ లాటరీ టికెట్ గిఫ్ట్ గా ఇచ్చాడు. ఇంత స్పెషల్ రోజున లాటరీ టికెట్ ఇవ్వడం భార్యకు నచ్చలేదు. లాటరీ టికెట్ తెచ్చినందుకు భర్తపై ఆగ్రహం వ్యక్తం చేసింది. లాటరీలపై అనవసరం డబ్బులు వృధా చేస్తున్నావంటూ భర్తతో గొడవ పెట్టుకుంది..

అయితే ఇప్పుడు అదే టికెట్ భార్యాభర్తలిద్దరి జీవితాన్ని మార్చేసింది. ఆ లాటరీ టికెట్ కి రూ.10 కోట్లు దక్కాయి. దీంతో వారి ఆనందానికి అవధులు లేకుండా పోయింది. అయితే మొదట్లో అంత మొత్తం లాటరీ తగిలిందని మరియా భర్త నమ్మలేదు. ఆ తర్వాత ప్రైజ్ మనీ గురించి న్యూస్ రావడంతో ఇద్దరు షాక్ అయ్యారు. ప్రేమికుల రోజుకు కొన్ని రోజుల ముందు తన భర్త మానసాస్ లోని 9103 మాథిస్ అవెన్యూలో ఇన్ అండ్ అవుట్ మార్ట్ నుంచి ఈ లాటరీ టికెట్ కొన్నట్లు మరియా చెప్పింది.  

Leave a Comment