పిల్లి కరిస్తే చాలా డేంజర్.. ఏం జరుగుతుందో తెలుసా?

పెంపుడు జంతువులను చాలా మంది ఇష్టంగా పెంచుకుంటారు. వాటిలో పిల్లి కూడా ఒకటి. వాటిపై ఇష్టంతో ముద్దాడుతుంటాారు. అయితే ఈ ఇష్టం ఒక్కోసారి ప్రమాదంగా మారుతుంది. ఎందుకంటే పిల్లి కరిస్తే చాలా ప్రమాదం..పిల్లికి పదునైనా దంతాలు ఉంటాయి. పిల్లి కరిచినప్పుడు దంతాలు చర్మంలోకి చొచ్చుకుపోతాయి. దీంతో ఇన్ఫెక్షన్ ఏర్పడుతుంది. పిల్లి నోటిలో ఉండే లాలాజలంలో బ్యాక్టీరియా ఉంటుంది. ఈ బ్యాక్టీరియా మనకూ సోకే ప్రమాదం ఉంది. 

ఎవరికైనా కుక్క కరిస్తే వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్లి చికిత్స తీసుకుంటారు. అయితే పిల్లి కరిస్తే మాత్రం అంతగా పట్టించుకోరు. కానీ పిల్లి కరిస్తే వెంటనే చికిత్స తీసుకోవాలి. ముందుగా గాయాన్ని సబ్బు నీటితో కడగాలి. అలా చేస్తే బ్యాక్టీరియా కొంత వరకు నశిస్తుంది. కుక్క కాటు వల్ల రేబిస్ వస్తుందని అందరికీ తెలుసు.. కానీ పిల్లి కాటు వల్ల కూడా రేబిస్ వస్తుందని చాలా మందికి తెలియదు.

ఈ వ్యాధిని నివారించడానికి రేబిస్ ఇంజెక్ట్ చేసుకోవాలి. డాక్టర్ సూచిస్తే టెటానస్ ఇంజెక్షన్ కూడా వేసుకోవాలి. టెటానస్ అనే బ్యాక్టీరియా చాలా డేంజర్. అంటే పెంపుడు జంతువులను ఎంతవరకు దగ్గరగా ఉంచుకోవాలో అంత వరకే ఉంచుకోవాలి. లేకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఒక్కోసారి వాటి వల్ల రోగాలు సంభవించవచ్చు.. 

 

Leave a Comment