ఉత్తరాఖండ్ సీఎం రాజీనామా..!

ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్ రావత్ తన పదవికి రాజీనామా చేశారు. కొంత మంది బీజేపీ మంత్రులు, ఎమ్మెల్యేలు ఆయన పనితీరుపై అసంతృప్తిగా ఉండటంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. దీనిపై ఆయన బీజేపీ కేంద్ర నాయకులను సైతం కలిశారు. 

అయితే మరుసటి రోజే ఆయన సీఎం పదవికి రాజీనామా చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. రావత్ తన రాజీనామా పత్రాన్ని రాష్ట్ర గవర్నర్ బేబీ రాణి మౌర్యకు అందజేశారు. రాష్ట్రానికి సేవ చేసే అవకాశం తనకు వచ్చిందని, అయితే ప్రస్తుతం ఈ అవకాశాన్ని మరొకరికి ఇవ్వాలని పార్టీ భావిస్తోందని రావత్ అన్నారు. అందుకే తాను రాజీనామా చేసినట్లు చెప్పారు. ప్రస్తుతం ఆయన స్థానంలో ధన్ సింగ్ రావత్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్నట్లు సమాచారం. 

Leave a Comment