చిన్నారికి గుండె ఆపరేషన్ చేయించిన మహేశ్..!

సూపర్ స్టార్ మహేశ్ బాబు సాయంలో శ్రీమంతుడులా మారాడు. గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్న చిన్నారికి ఆపరేషన్ చేయించారు. ఆర్థికంగా వెనుకబడి, గుండె సంబంధిత వ్యాధులతో బాధపడేవారికి వైద్యం అందించేందుకు ఇటీవల ఆయన ఆంధ్రప్రదేశ్ లోని ఓ హాస్పిటల్ తో జతకట్టిన సంగతి తెలిసిందే..

వీఎస్డీ, పీడీఏ గుండె సంబంధిత వ్యాధితో అంకిత్ భార్గవ్ అనే చిన్నారి ఆస్పత్రిలో చేరాడు. ఈ చిన్నారి వైద్యానికి అయ్యే ఖర్చును మహేశ్ బాబు, ఆయన భార్య నమ్రత శిరోద్కర్ ఇచ్చారు. ప్రస్తుతం ఈ చిన్నారి కోలుకుని హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యాడు. ఆ చిన్నారి తల్లిదండ్రులు మహేశ్ బాబుకు ధన్యవాదాలు తెలిపారు. ఆపరేషన్ అనంతరం చిన్నారి భార్గవ్ డిశ్చార్జ్ అవుతుండగా తల్లి చేతులో నవ్వుతూ కనిపించాడు. దీనికి సంబంధించిన ఫొటోను మహేశ్ భార్య నమ్రతా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. 

 

Leave a Comment