కోడలు ఉరేసుకుంటుంటే అత్తమామలు వీడియో తీశారు..!

కోడలు ఉరి వేసుకుంటుంటే రక్షించాల్సిన అత్తమామలు కిటికీలోంచి వీడియో తీశారు..ఈ దారుణ ఘటన ఉత్తరప్రదేశ్ లోని ముజఫర్ నగర్ లో ఆదివారం చోటుచేసుకుంది. పోలీసుల వివరాల మేరకు 2019లో కోమల్ కు ఆశిష్ తో వివాహం జరిగింది. వివాహ సమయంలో కోమల్ తల్లిదండ్రులు 5 లక్షలు డబ్బు, ఒక బైక్ ని కట్నంగా ఇచ్చారు. 

గత ఆరు నెలలుగా కోమల్ అత్తమామలు అదనపు కట్నం కావాలని, లేదంటే ఇంటి నుంచి వెళ్లిపోవాలని కోమల్ ను వేధిస్తున్నారు. భర్త ఆశిష్ కూడా తల్లిదండ్రులకే వత్తాసు పలికాడు.. వేధింపులు ఎక్కువ కావడంతో కోమల్ ఇటీవల పుట్టింటికి వెళ్లింది. ఊరి పెద్దలు కోమల్ కు నచ్చజెప్పడంతో తిరిగి అత్తారింటికి వెళ్లింది. 

అయితే అత్తమామల వేధింపులు మళ్లీ మొదలయ్యాయి. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైంది. ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకుంది. గదిలో వెళ్లి కోమల్ ఉరివేసుకుంది. అయితే కోడలు ఉరి వేసుకుంటున్న సమయంలో అత్తమామలు కిటికీలోంచి వీడియో తీశారు.. కోడలు మృతికి తమకు సంబంధం లేదని చెప్పుకునేందుకు ఆమె ఉరి వేసుకుంటున్న దృశ్యాలను సెల్ ఫోన్ లో బంధించారు. ఈ వీడియో కాస్త బయటకు వచ్చి వైరల్ అయింది. దీంతో పోలీసులు వారిని అరెస్టు చేశారు.  

Leave a Comment