అందరూ చూస్తుండగానే.. గ్రౌండ్ లోనే పని కానిచ్చాడు..!

బిగ్ బాష్ లీగ్(BBL 10)లో భాగంగా ఆదివారం సిడ్నీ థండర్స్, బ్రిస్బేన్ హీట్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో సిడ్నీ థండర్స్ జట్టు ఓపెనర్ ఉస్మాన్ ఖాజా చేసిన ఒక పని సోషల్ మీడియా వైరల్ గా మారింది. సిడ్నీ థండర్స్ బ్యాటింగ్ సమయంలో ఇన్నింగ్స్ 9వ ఓవర్ తర్వాత బ్రేక్ వచ్చింది. 

సిడ్నీ ఓపెనర్ ఖాజా తన అండర్ గార్మెంట్ లో గార్డ్ సమస్యగా మారింది. దీంతో బ్రేక్ సమయంలో ఖాజా డ్రెస్సింగ్ రూమ్ కు సైగ చేశాడు. వారు వచ్చే లోపు ఖాజా తన ప్యాంటును విప్పి తన అండర్ గార్డ్ ను తొలగించి దానిని సరిచేసే పనిలో పడ్డాడు. అంతలో సిబ్బంది అతని వద్దకు వచ్చి కొత్త గార్డ్ అందించడంతో దాని వేసుకొని ఆటను ప్రారంభించాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో నవ్వులు పూయిస్తోంది. 

 

Leave a Comment