నూతన వాహన పాలసీని ప్రకటించిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్..!

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సోమవారం మూడోసారి కేంద్ర బడ్జెట్ ని ప్రవేశపెట్టారు. కాలుష్య నివారణకు తమ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని వెల్లడించారు. వాయు కాలుష్య నివారణకు బడ్జెట్ లో రూ.2,217 కోట్లు కేటాయించారు. అందులో భాగంగా ఈ సారి బడ్జెట్ లో నూతన వాహన పాలసీని ప్రకటించారు. గడువు ముగిసిన వాహనాల కోసం ప్రత్యేక పాలసీని తీసుకొచ్చారు.

గడువు ముగిసిన వాహనల నుంచి కాలుష్యాన్ని తగ్గించడానికి తమ ప్రభుత్వం నూతన విధానాన్ని తీసుకురాబోతుందని వెల్లడించారు. దీనిలో భాగంగా కాలం తీరిన వాహనాలను తుక్కు కిందకు మార్చే పథకాన్ని త్వరలోనే అమల్లోకి తీసుకురాబోతున్నట్టు ప్రకటించారు. దీనిలో భాగంగా వ్యక్తిగత వాహనాల జీవిత కాలం 20 ఏళ్లు, కమర్షియల్ వాహనాల లైఫ్ టైమ్ ని 15 ఏళ్లుగా నిర్ధారించారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడిస్తామన్నారు.   

Leave a Comment